Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ వివేకా హత్య .. ‘‘అబ్బాయ్ కిల్డ్ బాబాయ్’’ , షర్మిలే చెప్పేశారు : నారా లోకేష్ ట్వీట్ వైరల్

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఎవరు చంపారో వైఎస్ షర్మిలే చెప్పేశారని ఆయన ట్వీట్ చేశారు. 

tdp leader nara lokesh tweet viral on ys viveka murder case ksp
Author
First Published Jul 21, 2023, 7:59 PM IST

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసును జగనాసుర రక్త చరిత్ర అని చెల్లి షర్మిల తేల్చారంటూ వైఎష్ షర్మిల వాంగ్మూలాన్ని గుర్తుచేశారు. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని.. హత్యకు పెద్ద కారణం వుందని షర్మిల పేర్కొన్న విషయాన్ని లోకేష్ ప్రస్తావించారు.

కడప ఎంపీగా పోటీ చేస్తానని బాబాయ్ వివేక అన్నారని.. కానీ అవినాష్ కుటుంబానికి వ్యతరేకంగా వివేకా నిలబడటమే హత్యకు కారణమని షర్మిల పేర్కొన్నారని లోకేష్ వెల్లడించారు. కుటుంబంలో అంతా బాగున్నట్లుగా వున్నా.. లోపల కోల్డ్ వార్ వుండేదంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలను నారా లోకేష్ ప్రస్తావించారు. మొత్తానికి ఇది జగనాసుర రక్త చరిత్ర అని తేలిందని.. అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్వీట్ చేశారు. 

ఇదిలావుండగా.. వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన సీబీఐకి ఇచ్చిన తన వాంగ్మూలంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన ఇచ్చిన ఈ వాంగ్మూలంలో వైఎస్ వివేకా హత్య ఆర్థిక కారణాలతో కాదు, రాజకీయ కారణాలతో జరిగిందని పేర్కొన్నారు. తన వద్ద ఆధారాలు లేవని, కానీ, రాజకీయ కారణాలతోనే వివేకా హత్య జరిగినట్టు తాను నమ్ముతున్నానని వివరించారు. అవినాశ్ రెడ్డి కుటుంబానికి వివేకా వ్యతిరేకంగా నిలబడ్డారని, వారికి అడ్డొస్తున్నారని మనసులో పెట్టుకుని ఉండొచ్చేమో అని పేర్కొన్నారు. 259వ సాక్షిగా ఆమె వాంగ్మూలాన్ని కోర్టుకు సీబీఐ అందించింది.

ALso Read: కోల్డ్ వార్ ఉండేది.. వివేకా హత్యకు రాజకీయపరమైన కారణాలు!: వైఎస్ షర్మిల వాంగ్మూలంలో కీలక వ్యాఖ్యలు

వివేకా హత్యకు గురికావడానికి ముందు బెంగళూరులోని తమ ఇంటికి ఆయన వచ్చారని షర్మిల తన వాంగ్మూలంలో చెప్పారు. తనను కడప ఎంపీగా పోటీ చేయాలని కోరారని వివరించారు. ఎంపీగా అవినాశ్ రెడ్డి పోటీ చేయవద్దని కోరుకుంటున్నట్టు తనకు తెలిపారని చెప్పారు. అవినాశ్‌కు టికెట్ ఇవ్వకుండా జగన్‌ను కన్విన్స్ చేయాలని తనను కోరారని వివరించారు.

బాగా ఒత్తిడి చేయడంతో తాను ఎంపీగా పోటీ చేయ డానికి సరేనని చెప్పట్టు పేర్కొన్నారు. అయితే, స్వయంగా వివేకాను పోటీ చేయవచ్చు కదా? షర్మిలను ఒత్తిడి చేయడమెందుకు అని సీబీఐ ప్రశ్నించగా.. ఎమ్మెల్సీగా ఓడిపోయినందున ఆయన ఎంపీ పోటీకి ఆసక్తి చూపలేదేమో అని షర్మిల పేర్కొన్నారు. అదీగాక, ఆయన విజయమ్మపై పోటీ చేశారు కాబట్టి, టికెట్ దక్కే అవకాశాలు ఉండవని భావిం చారని వివరించారు.

కుటుంబంలో అంతా బాగున్నట్టు కనిపించినా లోపల అలా లేదని వైఎస్ షర్మిల తన వాంగ్మూలంలో చెప్పారు. లోపల కోల్డ్ వార్ జరిగేదని పేర్కొన్నారు. తనకు తెలిసినంత వరకు ఎమ్మెల్సీగా వివేకానంద ఓటమికి అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మరికొందరు సన్నిహితులే కారణమై ఉంటారని తన నమ్మకం అని షర్మిలా వివరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios