భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ టాక్ సాధించింది. ఈ సందర్భంగా స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు సినిమాను ఇంత విజువల్ వండర్ గా తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళికి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలియజేసారు.
అమరావతి: మరోసారి తెలుగుసినిమా దమ్మేంటో చాటిచెబుతూ దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుదిరం) ((raudram ranam rudiram) హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ఇవాళ(శుక్రవారం) విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి వుందంటూ థియేటర్ల వద్ద మెగా, నందమూరి అభిమానులు సందడి చేస్తున్నారు. ఇక సినిమాకు హిట్ టాక్ రావడంతో సీనీ, రాజకీయ ప్రముఖులు RRR టీం కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ (nara lokesh) కూడా RRR హీరోలు, డైరెక్టర్ తో పాటు యూనిట్ మొత్తానికి సోషల్ మీడియా వేధికన శుభాకాంక్షలు తెలిపారు.
''ఇవాళ విడుదలైన RRR సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. దీన్నిబట్టే ఈ సినిమా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నట్లు అర్థమవుతోంది. ఇలా మరో అద్భుత విజయాన్ని అందుకున్న స్టార్ హీరోలు తారక్ (జూనియర్ ఎన్టీఆర్), రామ్ చరణ్ తేజ్ (ramcharantej), మ్యాస్ట్రో డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో పాటు సినిమా యూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు. మీరంతా కలిసి ఓ అద్భుతమమైన సినిమాను అందించారు'' అని లోకేష్ అన్నారు.
''RRR మూవీకి వస్తున్న స్పందన చూస్తుంటే వెంటనే సినిమా చూడాలని వుంది. తప్పకుండా ఈ వారమే కుటుంబంతో కలిసి సినిమాను చూస్తాను. ఈ మూవీ రికార్డులన్నింటిని బద్దలుకొట్టాలని కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ గయ్స్'' అంటూ RRR పవర్ ఫుల్ పోస్టర్ ను జతచేసి లోకేష్ ట్వీట్ చేసారు.
ఇక సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది మొదలు అసలు ప్లాప్ అన్న మాటే దర్శకుడు రాజమౌళి వినలేదు. ఆయన సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలుగొడుతుంటాయి. బాహుబలి వంటి భారీ హిట్ సినిమా తర్వాత తెరకెక్కిన RRR సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నారు. ఈ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా వున్నట్లు... ఇద్దరు హీరోలు అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారని అభిమానులు అంటున్నారు. సినిమాకు వస్తున్న స్పందన చూసి సినీ, రాజకీయ ప్రముఖులు RRR యూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవాళ(శుక్రవారం) విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాను హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్, దర్శకుడు రాజమౌళితో పాటు వారి కుటుంబసభ్యులు ప్రేక్షకుల మధ్య థియేటర్లలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. భారీ అంచనాలకు మించి సినిమా వుండటంతో ప్రేక్షకులు థియేటర్లలో సీట్లపై కూర్చోకుండా సందడి చేస్తున్నారు. ఈ రెస్పాన్స్ ను చూసి సినిమా యూనిట్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు చేసుకుంటున్నారు.
ఇలా రాంచరణ్, ఉపాసన ఓ థియేటర్ లో అభిమానులతో కలసి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. అయితే సినిమా చూస్తున్నంతసేపు ఉపాసన సందడి చేసారు. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే ఉపాసన ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ పేపర్లు చించి ఎగిరేసారు. థియేటర్లో ఉపాసన రచ్చకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమె పరిస్థితే ఇలా వుంటే సాధారణ అభిమానుల వుంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఓవరాల్ గా ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఇప్పుడు అందరూ కలెక్షన్స్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. భారీ కలెక్షన్స్ తో ఇండస్ట్రీ రికార్డులను బద్దలుగొట్టే అవకాశాలున్నాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుందేమో చూడాలి.
