Asianet News TeluguAsianet News Telugu

వెనుక జగన్ .. ఆర్జీవీ ఇష్టమొచ్చినట్లుగా తీశారు, చంద్రబాబే టార్గెట్ : ‘‘వ్యూహం’’పై హైకోర్టులో లోకేష్ పిటిషన్

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘‘వ్యూహం’’ సినిమా వివాదాల్లో నలుగుతూనే వుంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జగన్ వెనుక ఉండి వ్యూహం సినిమా తీయించారని లోకేష్ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. 

tdp leader nara lokesh filed petetion in telangana high court against ram gopal varmas Vyooham movie ksp
Author
First Published Dec 22, 2023, 8:08 PM IST

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘‘వ్యూహం’’ సినిమా వివాదాల్లో నలుగుతూనే వుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఆర్జీవీ ఈ మూవీని రూపొందించారు. అయితే దీనిపై తెలుగుదేశం పార్టీ తొలి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వ్యూహం సెన్సార్ సర్టిఫికెట్ ను రద్దు చేయాలని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిని విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఈ నెల 26న విచారించనుంది. రాంగోపాల్ వర్మ ఇష్టమొచ్చినట్లు సినిమా తీశారని.. తన ఇష్టాఇష్టాలతో పాత్రలను నిర్ణయించుకున్నారని లోకేష్ తన పిటిషన్‌లో తెలిపారు.

వ్యూహం సినిమాలో చంద్రబాబును తప్పుగా చూపించారని..  ట్రైలర్ మాదిరిగానే సినిమా అంతా ఉండే అవకాశం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. చంద్రబాబును అప్రతిష్ట పాల్జేసేందుకే సినిమా తీశారని.. వ్యూహం సినిమాతో జగన్‌కు లబ్ధి కలిగేలా చూస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. వాక్ స్వాతంత్ర్యం పేరిట ఇష్టారీతిన సినిమా తీశారని.. దర్శక, నిర్మాతల చర్యలతో చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని లోకేష్ తన పిటిషన్‌లో ప్రస్తావించారు.

వ్యూహం సినిమాతో టీడీపీ ప్రతిష్ట దెబ్బతింటోందని.. ఇప్పటికే దర్శక నిర్మాతలు పలు తప్పుడు చిత్రాలు విడుదల చేశారని లోకేష్ తెలిపారు. లాభాలు రాకపోయినా మళ్లీ సినిమా తీస్తున్నారని, నష్టాలు వస్తాయని తెలిసినా జగన్ లబ్ధి కోసమే చిత్రం తీశారని ఆయన ఆరోపించారు. జగన్ వెనుక ఉండి వ్యూహం సినిమా తీయించారని లోకేష్ కోర్ట్ దృష్టికి తీసుకెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios