Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కంటతడి రాష్ట్రానికి అరిష్టం.. ప్రతీకారం తీర్చుకుంటాం : వైసీపీకి నక్కా ఆనందబాబు హెచ్చరిక

రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు. చంద్రబాబుతో కంటతడి పెట్టించారని... అది రాష్ట్రానికి అరిష్టమని ఆయన అన్నారు. వైసీపీ ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు మనోస్థైర్యాన్ని కోల్పోరని... తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని ఆనంద బాబు హెచ్చరించారు. 

tdp leader nakka anand babu slams ysrcp over ys viveka murder case
Author
Amaravati, First Published Nov 19, 2021, 5:46 PM IST

రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకూడదని వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (nakka anand babu) . శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీకి చెందిన ప్రతి నాయకుడు కుప్పం (kuppam election) గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జగన్ మెప్పు పొందేందుకు పోటీలు పడి చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆనంద బాబు వ్యాఖ్యానించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కుప్పంలో మూడు నెలలు ఉండి ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున పంచారని ఆయన ఆరోపించారు. వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు త్వరలోనే వస్తాయని ఆనంద బాబు జోస్యం చెప్పారు. 

వైఎస్ వివేకా హత్య కేసులో (ys viveka murder case) వాస్తవాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయని... వీటిపై చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి దీనిపై గ్రామ స్థాయిలో చర్చ పెడతామని ఆనందబాబు తెలిపారు. చంద్రబాబుతో కంటతడి పెట్టించారని... అది రాష్ట్రానికి అరిష్టమని ఆయన అన్నారు. వైసీపీ ఎన్ని కుతంత్రాలకు పాల్పడినా టీడీపీ కార్యకర్తలు మనోస్థైర్యాన్ని కోల్పోరని... తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని ఆనంద బాబు హెచ్చరించారు. 

Also Read:అసెంబ్లీ సమావేశాలకు టీడీపీ దూరం: టీడీఎల్పీ కీలక నిర్ణయం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు (ap assembly sessions) వాడివేడిగా జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరడం తెలిసిందే. ముఖ్యంగా టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడును, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ (ysrcp) నేతలు చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి నొచ్చుకున్న చంద్రబాబు... మళ్లీ సీఎం అయిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానంటూ శపథం చేశారు. ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు.  

దీనిపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (gorantla butchaiah chowdary) స్పందించారు. నీచమైన పదానికి అర్థం వైసీపీ అని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడితో కన్నీరు పెట్టించారని గోరంట్ల మండిపడ్డారు. అసలు, వైసీపీలో విజ్ఞత గల నాయకులు ఉన్నారా? లేక పనికిమాలిన నేతలు మాత్రమే ఉన్నారా? అని బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం (ap cm) జగన్ (ys jagan mohan reddy) వెకిలి నవ్వులు నవ్వుతుండడం సిగ్గుమాలిన చర్య అని .. ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని గోరంట్ల హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios