ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకి మరో షాక్ తగలనుంది. పార్టీ కీలక నేత ఒకరు వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే పలువరు కీలక నేతలు పార్టీని వీడి.. కొందరు వైసీపీ, మరికొందరు బీజేపీలో చేరారు. కాగా... ఇప్పుడు మరో కీలక నేత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

AlsoRead జగన్‌కు భారీ షాకిచ్చే యోచనలో బిజెపి... విజయవాడకు సీబీఐ...

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన డీసీసీబీ మాజీ చైర్మన్‌ ముత్యాల రత్నం వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే సీనియర్‌ నేతలు రత్నంను పార్టీలో చేర్చుకోవడానికి వీలుగా సన్నాహాలు ఆరంభించారు. ఉండి నియోజకవర్గంతో పాటు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లోనూ ముత్యాలరత్నంకు మంచి పట్టు ఉంది. అదీకాకుండా మంత్రి పేర్ని నానికి రత్నం కుటుంబం అత్యంత చేరువ. ఈ కారణంగానే కొద్దిరోజులుగా ముత్యాలరత్నంతో పాటు మిగతా వారిని వైసీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్టు సమాచారం.
 
 ఈ నేపథ్యంలో ఈనెల 14న సీఎం జగన్మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు రానున్నట్టు ముందుగా తెలియడంతో ఆయన సమక్షంలోనే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేశారు. తీరా సీఎం జిల్లా పర్యటన రద్దవ్వడంతో నేరుగా సీఎం క్యాంపు కార్యాలయంలోనే రత్నం చేరికకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు చెబుతున్నారు. ఆయన సోదరుడు శివయ్య కూడా నేడు స్థానిక నేతల సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు.