జగన్‌ది క్రిమినల్ బ్రెయిన్ .. ఓటమి భయంతోనే ఓటర్ లిస్ట్‌లో అక్రమాలు : కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. వాళ్లు ఉన్న చోట ఓట్లు ఉంటుంది, జగనన్న కాలనీలోనూ ఓట్లు ఉంటున్నాయని పేర్కొన్నారు. ఆరుతడులిస్తామని రైతులను మోసం చేశారని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు.

సత్తెనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జీ, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇరు పార్టీలు కూడా గ్రామస్థాయిలో సమన్వయంతో ఈ రాక్షస ప్రభుత్వాన్ని పారదోలటానికి, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం అయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి తన పాలన మీద నమ్మకం లేక నిజాయితీగా వెళ్ళలేక ఓటర్ లిస్ట్ తీసివేసి గందరగోళం సృష్టిస్తున్నారని కన్నా ఆరోపించారు. 175 నియోజవర్గల ఓటర్ లిస్ట్ మేనేజ్ చెయ్యడం సాధ్యం కాదని, కానీ చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
ఈ క్రిమినల్ బ్రెయిన్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించినట్లయితే బాగుండేదని కన్నా లక్ష్మీనారాయణ చురకలంటించారు. ఎన్నికల సమయానికి ఓటమి భయంతో ఏ రకంగానైనా గెలవాలని ఉద్దేశంతో ఓటర్ లిస్టులో అక్రమాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇరు పార్టీలు కూడా ఓటర్ లిస్టు విషయంలో జాగ్రత్త పడాలి అనుకున్నామన్నామని కన్నా తెలిపారు. జగనన్న కాలనీలు పేదల ముసుగులో పెద్ద అవినీతి జరుగుతోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
వాళ్లు ఉన్న చోట ఓట్లు ఉంటుంది, జగనన్న కాలనీలోనూ ఓట్లు ఉంటున్నాయని పేర్కొన్నారు. అది కలెక్టర్‌కి, ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వరకపూడిశిలా నేను చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో చెప్పి శంకుస్థాపన చేయించానని తెలిపారు. తండ్రి శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుకి మరలా జగన్ శంకుస్థాపన చేస్తున్నారని చురకలంటించారు. ఆరుతడులిస్తామని రైతులను మోసం చేశారని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. చిత్తశుద్ధి ఉంటే నాగార్జునసాగర్ కుడికాలువ ఆరుతడునీళ్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శంకుస్థాపన చేసిన వరికపుడి శిల ప్రాజెక్టు మరలా శంకుస్థాపన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కన్నా చెప్పారు.