Asianet News TeluguAsianet News Telugu

ఆ మంత్రులే రాసలీలల్లో మునిగితేలుతుంటే... మహిళా రక్షణ ఇంకెక్కడ: కళా వెంకట్రావు ఆగ్రహం

బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను పోలీసులు అడ్డుకోవడంపై మాజీ మంత్రి కళా వెంకట్రావు సీరియస్ అయ్యారు. 

TDP Leader Kala Venkatrao Sexual Allegations on AP Ministers and YCP MLAs
Author
Amaravati, First Published Sep 9, 2021, 2:46 PM IST

గుంటూరు: ప్రస్తుతం మానవ హక్కులను హరించడమే కాకుండా చట్టాల్ని ఉల్లంఘిస్తున్న పోలీస్ అధికారులు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని మాజీ మంత్రి, టిడిపి నాయకులు కిమిడి కళా వెంకట్రావు హెచ్చరించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నరసరావుపేటకు వెళుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కోవిడ్ నిబంధనల పేరిట అడ్డుకోవడం దారుణమన్నారు. వేలాది మందితో సజ్జల సభకు వర్తించని కోవిడ్ నిబంధనలు లోకేష్ పర్యటనకు మాత్రమే వర్తిస్తాయా? అని కళా వెంకట్రావు నిలదీశాకరు. 

''రాష్ట్రంలో జగన్ రెడ్డి రెండేళ్ల  పాలనలోనే సుమారు 500 మంది మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు వెంకట్ రెడ్డిని మూడు నెలలు దాటినా ఇంతవరకు ఎందుకు పట్టుకోలేక పోయారు? ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులైతే పట్టుకోరా?'' అని ప్రశ్నించారు. 

''వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా హింసిస్తూ రాసలీలల్లో మునిగి తేలుతూ అంబోతుల్లా వ్యవహరిస్తున్నారు. వీరిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? అధికార పార్టీ నేతలే అఘాయిత్యాలకు పాల్పడుతుంటే.. ఇక రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, నేరాలకు ఎలా అడ్డుకట్ట పడుతుంది?'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో మైనార్టీ దంపతులు ఆటోలో వెళ్తుండగా వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారి పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే పట్టించుకోలేదు. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? సత్తెనపల్లి నియోజకవర్గంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భర్తను బెదిరించి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే.. ఇది తమ పరిధిలోనిది కాదంటూ సత్తెనపల్లి పోలీసులు తప్పించుకున్నారు. దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు?'' అని నిలదీశారు. 

read more  లోకేష్ అంటేనే ఈ పిరికి సీఎంకు వణుకు... పంచెలు తడుస్తున్నాయి: అచ్చెన్నాయుడు

''నిర్భయ చట్టం కింద కేంద్రం రాష్ట్రానికి రూ.139 కోట్లు విడుదల చేస్తే కేవలం రూ.30 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టడం జగన్మోహన్ రెడ్డి చేతగానితనం కాదా? దీనికి డీజీపీ ఏం సమాధానం చెబుతారు? దిశ చట్టం కింద ముగ్గురికి ఉరిశిక్ష, 20 మందికి యావజ్జీవ కారాశిక్ష వేశామని చెప్పిన హోంమంత్రి, డీజీపీ చెబుతున్నారు. అయితే ఇలా శిక్షించిన వారి వివరాలు బహిర్గతం చేయాలి. లేనిపక్షంలో ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి'' అని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు. 

''కట్టుకున్న భార్యను హింసించిన అధికారికి జగన్ రెడ్డి ఉన్నత పదవులు ఇచ్చి సత్కరిస్తే.. మహిళపై నేరాలు ఎలా తగ్గుతాయి? రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలకు వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యయుతంగా లోకేష్ బాధితులకు అండగా నిలుస్తుంటే అడ్డుకోవడం దుర్మార్గం. కడప జిల్లా ప్రొద్దుటూరులసజ్జల రామకృష్ణారెడ్డి వేలాది మందితో నిర్వహించిన సమావేశానికి అడ్డురాని కరోనా నిబంధనలు లోకేష్ గారికే అడ్డువస్తాయా?'' అని నిలదీశారు. 

''మీ అరాచకాలతో మానవ హక్కులు, చట్టాల్ని ఉల్లంఘిస్తే భవిష్యత్ లో అధికారులు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందనే విషయాన్ని గ్రహించాలి. గతంలో వైఎస్సార్, జగన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు అండగా నిలిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నేడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి'' అని కళా వెంకట్రావు అధికారులను హెచ్చరించారు. 
 
                    
                                                                             
 

Follow Us:
Download App:
  • android
  • ios