తాడిపత్రి  మున్సిపల్ చైర్మెన్  జేసీ ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి వెళ్లవద్దని  జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు. 

అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మెన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని మంగళవారంనాడు  పోలీసులు హౌస్ అరెస్ట్  చేశారు.   శాంతి భధ్రతల దృష్ట్యా  పెన్షన్ల పంపిణీకి  వెళ్లకూడదని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ విషయమై  జేసీ ప్రభాకర్ రెడ్డి  పోలీసుల తీరుపై  ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెన్షన్ల పంపిణీకి తనను అధికారులు ఆహ్వానించారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  పోలీసులకు  చెప్పారు. చైర్మెన్  హోదాలో తనకు  పెన్షన్ల పంపిణీకి  ఆహ్వానం పంపారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  చెప్పారు.