Asianet News TeluguAsianet News Telugu

ఛార్జ్‌షీట్ మాయమైనట్టు ఆయనకెలా తెలుసు.. పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి కౌంటర్

వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ల ఛార్జ్‌షీట్ మాయమైనట్లుగా తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఛార్జీ‌షీట్ మాయమైన విషయం పెద్దారెడ్డికి ఎలా తెలుసునని ఆయన ప్రశ్నించారు.
 

tdp leader jc prabhakar reddy counter to ysrcp mla pedda reddy
Author
First Published Jan 3, 2023, 6:52 PM IST

తనపై ఎమ్మెల్యే పెద్దారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. ఛార్జీ‌షీట్ మాయమైన విషయం పెద్దారెడ్డికి ఎలా తెలుసునని ఆయన ప్రశ్నించారు. ఈ అంశం బయటకు ఎలా పొక్కిందో బయటకు బయటపెట్టాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడిన పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జేసీ కోరారు. 

అంతకుముందు ఎమ్మెల్యే పెద్దారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కోర్టులో లారీల అక్రమ రిజిస్ట్రేషన్ల ఛార్జ్‌షీట్‌ను ప్రభాకర్ రెడ్డి మాయం చేశాడని ఆయన ఆరోపించారు. రూ.40 లక్షలు ఖర్చు పెట్టి ఛార్జ్‌షీట్‌ను కనిపించకుండా చేశాడని పెద్దారెడ్డి అన్నారు. పోలీసులు, కోర్టు సిబ్బంది ప్రభాకర్ రెడ్డికి సహకరించారని ఆయన ఆరోపించారు. ప్రభాకర్ రెడ్డికి నేరాలు చేయడం.. అధికారులపై వేయడం అలవాటంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. 

ALso REad: కోర్టులో ఆ ఛార్జ్‌షీట్ మాయం చేయించాడు.. 40 లక్షలు ఖర్చు : జేసీ ప్రభాకర్ రెడ్డిపై పెద్దారెడ్డి ఆరోపణలు

కాగా.. గత నెలలో తాడిపత్రిలో సీబీఐ సోదాలు నిర్వహించిన  సంగతి తెలిసిందే. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 పేరిట అక్రమంగా విక్రయించారన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమ వాహనాల కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు జఠాదర ఇండస్ట్రీస్ చవ్వా గోపాల్ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. కీలకమైన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. జఠాధర ఇండస్ట్రీస్‌తో పాటు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈడీ అధికారుల ఎదుట ఇప్పటికే రెండు సార్లు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. అలాగే ఈ కేసులో ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. 

బీఎస్ 3 వాహనాలను స్క్రాప్స్ కింద కొని బీఎస్ 4గా అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా జేసీ ట్రావెల్స్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వాటిలో చవ్వా గోపాల్ రెడ్డి పేరిట కొన్ని వాహనాలు వున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం 154 వాహనాలను నాగాలాండ్‌లో రిజిస్ట్రేషన్ చేయించింది జేసీ ట్రావెల్స్. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో ఇప్పటికే రూ.22 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ.

Follow Us:
Download App:
  • android
  • ios