పల్నాడు జిల్లా దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కానిశెట్టి నాగులు ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు. పాతకక్షల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది.
పల్నాడు జిల్లా దాచేపల్లిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు కానిశెట్టి నాగులు ఇంటిపై కొందరు వ్యక్తులు దాడిచేశారు. పాతకక్షల నేపథ్యంలో వైసీపీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. వివరాలు.. మున్సిపల్ ఛైర్మన్ భర్త , కుమారులు మూకుమ్మడిగా తమ ఇంటిపై దాడికి పాల్పడ్డారని కానిశెట్టి నాగులు తెలిపారు. ఈ దాడిలో నాగులు ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసమైందని చెప్పారు. ప్రాణభయంతో ఇంట్లోకెళ్లి తాళాలు వేసుకోవడంతో.. ఇంటి ఆవరణలో ఉన్న పశువులపై దాడి చేశారని ఆరోపించారు.
పోలీసులు రావడంతో వారు తన ఇంటి వద్ద నుంచి వెళ్లిపోయారని నాగులు చెప్పుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటేయలేదనే కక్షతోనే నిందితులు తమ ఇంటిపై దాడి చేశారని నాగులు చెబుతున్నారు. గతంలో కూడా బెదిరింపులకు పాల్పడినట్టుగా చెప్పారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
