గుంటూరు: మాజీ మంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై సినీ నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇలా లోకేష్ పై ట్విట్టర్ వేదికన విమర్శలు చేసిన గణేష్ పై అదే ట్విట్టర్ ద్వారా టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి కూడా విరుచుకుపడ్డారు. 

''అంతా బాగుంద‌య్యా బండ్ల‌. పెంట‌లాంటి నీ మీద రాయి వేయ‌డం ఎందుకు అనుకున్నాం. కానీ నువ్వు టీటీడీని గ‌బ్బు ప‌ట్టించిన‌ రెడ్డి వేసిన పిడిగ్రీ తిని మొరుగుతున్నావ‌ని అర్థ‌మ‌య్యాక నీ బ్లేడు బాగోతం బ‌య‌ట‌పెట్టాల్సిందేన‌ని ఈ రిప్ల‌య్ ట్వీటు'' అంటూ దివ్యవాణి బండ్ల గణేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

''లోకేశ్‌ని చూసి భ‌యం వేయ‌డానికి నీలాగ న‌ర‌హంత‌కుడు న‌యీంతో క‌లిసి దందాలు చేయ‌లేదే! నీలాగ బ్లేడ్తో గొంతులు కోసే ర‌క‌మూ కాదే!. బండ్ల త‌మ్ముడు గొంతు కోసుకోడానికి 7ఓ క్లాక్‌ బ్లేడు కొనుక్కోవ‌డానికి  5 రూపాయ‌ల్లేకపోతే అడుక్కో'' అని మండిపడ్డారు. 

''ఎవ‌రో ఒక‌రు ప‌డేస్తారు. ఇలా గ‌బ్బురెడ్డి వేసిన ఎక్స్‌పైరీ దేట్ దాటిన‌ తిండి తిని పిచ్చెక్కిన‌ట్టు మొర‌గ‌కు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కూ బ్లేడు బ్యాచ్ హెడ్‌గా వుండే బండ్ల‌‌ ట్వీటుకు నోటు తీసుకునే స్థాయికి దిగ‌జారిపోవ‌డమే ఓడలు బండ్ల అవ్వ‌డ‌మంటే'' అని ఎద్దేవా చేశారు. 

''స్టాన్‌ఫోర్డ్‌లో చ‌ద‌వ‌డ‌మంటే ఎవ‌డో బ‌డాబాబుల సొమ్ముకు బినామీగా వ్య‌వ‌హ‌రించి సినిమా తీసి బ‌డా ప్రొడ్యూస‌ర్ అనిపించుకోవ‌డం కాదు. మంగ‌ళ‌గిరిలో ఎమ్మెల్యేగా గెల‌వ‌డం అంటే నువ్వు సినిమా టికెట్ బ్లాక్ లో కొన్న‌ట్టూ కాదు'' అంటూ బండ్లకు చురకలు అంటించారు. 

''పంచాయ‌తీరాజ్ శాఖా మంత్రిగా నారా లోకేశ్ 25 వేల‌ కిలోమీట‌ర్ల సిసీ రోడ్డు వేయించారు. దేశంలో త‌యార‌య్యే ప్ర‌తీ 10 సెల్‌ఫోన్ల‌లో మూడు ఫోన్లు ఏపీలో త‌యార‌వుతున్నాయంటే ద‌టీజ్ ఐటీ అండ్ ఎల‌క్ట్రానిక్స్‌ మినిస్ట‌ర్ లోకేశ్‌'' అంటూ మాజీ ఐటీమంత్రిపై ప్రశంసలు కురిపించారు. 

''ఉపాధి హామీలో దేశంలోనే అగ్ర‌స్థానం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ది. ఇదీ గ్రామీణాభివృద్ధిశాఖా మంత్రిగా లోకేశ్ సాధించిన రికార్డు. నువ్వో క్రిమిన‌ల్‌వి అని నీపై కేసులు చెబుతున్నాయి. నీకు 11 చార్జిషీట్లున్న 43 వేల కోట్ల గ‌జ‌దొంగ జ‌గ‌న్ ఆద‌ర్శం కావ‌డంలో త‌ప్పులేదు బండ్ల‌.  మా నారా లోకేశ్‌పై ఒక్క అవినీతి కేసూలేదు'' అన్నారు. 

''ఆయ‌న మంత్రిగా నిర్వ‌హించిన శాఖ‌ల‌కు అత్య‌ధిక అవార్డులు వ‌చ్చాయి. మీలాంటి క్రిమిన‌ల్స్‌కి  న‌చ్చే సీబీఐ..ఈడీ కేసుల్లో ఏ 1, లిక్క‌ర్ డాన్ జ‌గ‌న్‌లాంటి నాయ‌కుడిగా మా నారా లోకేశ్ ఎప్ప‌టికీ కాలేడు'' అని అన్నారు. 

''చివ‌రికి చెక్ బౌన్స్ కేసులు, క్రిమిన‌ల్ గ్యాంగుల‌తో సంబంధాలున్న  బండ్ల గ‌ణేష్ కూడా కోట్స్ ట్వీట్ చేస్తున్నాడు ఇదే క‌రోనా కాలం అంటే!''అంటూ  బండ్ల గణేష్ పై ఓస్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి నాయకురాలు దివ్యవాణి.