రోడ్డు ప్రమాదంలో టీడీపీ నేత మృతి చెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో చోటుచేసుకుంది. పేరుపాలెం నార్త్ గ్రామ టీడీపీ అధ్యక్షుడు చినిమిల్లి కృష్ణ(35) రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.

గ్రామంలో తాను సాగు చేసుకుంటున్న చేపల చెరువుకు మేత తీసుకుని బైక్‌పై వెళ్ళుతుండగా చెరువు సమీపంలో ఆగిఉన్న బైక్‌ను తప్పించబోయి ప్రమాదానికి గురై మృతి చెందారు. కృష్ణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బుధవారం పేరుపాలెం నార్త్‌ గ్రామం మీదుగా పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి లోకేశ్‌ వెళ్తూ కృష్ణ చిత్ర పటానికి నివాళులర్పించి కృష్ణ కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు