ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై టీడీపీ నేత దేవీ బాబు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.
న్యూఢిల్లీ: ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదిపై టీడీపీ నేత దేవీ బాబు మంగళవారం నాడు ఫిర్యాదు చేశారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘిస్తూ కడప జిల్లాలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను కూడ ప్రదర్శించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన సీఈఓపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. మరోవైపు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంపై కూడ ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా సీఎస్ వ్యవహరించారని ఆయన ఆరోపించారు.
