వైసీపీలోకి వెళ్లేందుకు మరో టీడీపీ నేత సర్వం సిద్ధం చేసుకున్నారు. అయితే.. విషయం తెలుసుకున్న బాలకృష్ణ ఒక్క ఫోన్ చేయడంతో.. ఆయన మళ్లీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. ఈ సంఘటన హిందూపురంలో చోటుచేసుకుంది.

అసలు మ్యాటర్ లోకి వెళితే.. లేపాక్షి మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకులు కొండూరు మల్లికార్జున పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో ఎంతో నమ్మకంగా పనిచేస్తున్నప్పటికీ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పార్టీ మారాలని అనుకున్నారు. విషయం తెలుసుకున్న పార్టీ నేతలు బుజ్జగింపు చర్యలు చేపట్టారు.

అయినప్పటికీ పార్టీ మారాలనే ఉన్నానని స్పష్టం చేశారు.  దీంతో.. ఈ విషయంపై బాలకృష్ణ ఫోన్ లో మల్లికార్జునతో మాట్లాడించారు. బాలయ్య న్యాయం చేస్తానని మాట ఇవ్వడంతో.. ఆయన తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.