టీడీపీలో (tdp) మరో ఇద్దరు నేతలు వియ్యంకులు కాబోతున్నారు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న బోండా ఉమా (bonda uma) ... నంద్యాల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి (av subba reddy) వియ్యంకులు కానున్నారు.

టీడీపీలో (tdp) మరో ఇద్దరు నేతలు వియ్యంకులు కాబోతున్నారు. విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే, పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న బోండా ఉమా (bonda uma) ... నంద్యాల టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి (av subba reddy) వియ్యంకులు కానున్నారు. బోండా ఉమా కుమరుడు సిద్దార్ధ్..ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఏవీ జస్విత రెడ్డిని పెళ్లాడనున్నారు. ఈ మేరకు రెండు కుటుంబాల మధ్య నిర్ణయం జరిగింది. మార్చి 27న వీరి వివాహ నిశ్చితార్ధం జరగనుంది. హైదరాబాద్‌లోని ఫలక్ నుమా ప్యాలెస్‌లో వీరిద్దరికి ఎంగేజ్‌మెంట్ జరగనుంది. సిద్ధార్ధ్, జస్విత అమెరికాలో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ప్రధానంగా ఎన్నారై టీడీపీ విభాగంలో సిద్ధార్ధ్, జస్విత కీలక పాత్ర పోషిస్తున్నారు. 

ఇప్పటికే టీడీపీలో మాజీ మంత్రులు గంటా శ్రీనివాస రావు.. పీ నారాయణ వియ్యంకులుగా ఉన్నారు. అదే విధంగా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామాంజనేయులు సైతం గంటాకు వియ్యంకులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు - కొమ్మాలపాటి శ్రీధర్ సైతం వియ్యంకులే. ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి ఏవీ సుబ్బారెడ్డి- బొండా ఉమా కూడా చేరనున్నారు.