Asianet News TeluguAsianet News Telugu

ఆడవారి రొమ్ములపై చేతులేసిన డీఎస్పీ.. నీ పెళ్లాన్నీ అలాగే చేస్తే..: బొండా ఉమ సీరియస్

మహిళా రైతులపట్ల వారి భర్తలముందే నీచాతీనీచంగా పోలీసులు వ్యవహరించిన తీరుచూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోందని బోండా ఉమ మండిపడ్డారు. 

TDP Leader bonda uma serious on police
Author
Amaravathi, First Published Mar 9, 2021, 4:15 PM IST

అమరావతి: మహిళా దినోత్సవంనాడే వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని మహిళలపట్ల అత్యంత దారుణంగా వ్యవహరించారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు వాపోయారు. మహిళలని కూడా చూడకుండా మగ పోలీసుల సాయంతో ఇష్టారీతిన బూటుకాళ్లతో తన్నించాడని ఆవేదన వ్యక్తం చేశారు.  పోలీసులు చేతులతో ఆడవారిని  తాకరాని ప్రదేశాల్లో తాకుతూ, జుట్లుపట్టుకొని దారుణంగా ఈడ్చిపారేశారని... మహిళా రైతులపట్ల వారి భర్తలముందే నీచాతీనీచంగా పోలీసులు వ్యవహరించిన తీరుచూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోందని బోండా ఉమ మండిపడ్డారు. 

 మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో బోంగీ ఉమ మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణలేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ తెలిసిపోయిందన్నారు. రాజధాని మహిళలు శాంతియుతంగా నిరసనతెలుపుకోవచ్చని గతంలో డీజీపీ చెప్పారు... మరి నిన్న(సోమవారం) పోలీసులు రాజధాని మహిళలపట్ల ఎందుకంత దారుణంగా ప్రవర్తించారు? అని ప్రశ్నించారు. మహిళలు చేసిన ఘోరం-నేరమేమిటి? వారేమైనా ఉగ్రవాదులా..నేరస్తులా....లేకపోతే ప్రజా వ్యతిరేక ఉద్యమాలు చేయడానికి వెళ్లారా? అమ్మవారి గుడికి వెళ్లాలనుకోవడమే వారు చేసిన తప్పా? అని నిలదీశారు. 

''అమ్మవారి దర్శనానికి వెళ్లాలనుకున్న మహిళలపై పడి పోలీసులు అమాంతంగా మదమెక్కిన దున్నపోతుల్లా ప్రవర్తించారు. 448రోజులుగా అమరావతికోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలు, ఎస్సీలు, మైనారిటీలపై తప్పుడుకేసులు పెట్టి దొంగల్లాగా వారికి సంకెళ్లు వేశారు. చరిత్రలో ఎక్కడాలేని విధంగా దళితులపై ఈ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులుపెట్టి జైలుకు పంపింది'' అని గుర్తుచేశారు.

''మహిళా దినోత్సవం పేరుతో, దిశా యాప్ ల పేరుతో హాడావుడి చేస్తున్న జగన్ ప్రభుత్వం మహిళలను పోలీసుల బూట్లకిందేసి అణగదొక్కింది. ప్రభుత్వం, పాలకులు చేసిన పనికి, దౌర్జ న్యాలకు మహిళలకు రాష్ట్రంలో రక్షణ అనేది ఉందా?  రోజుకొక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. మహిళలపై దారుణాలు జరిగే రాష్ట్రాల్లో  దేశంలోనే ఏపీ నాలుగోస్థానంలో ఉంది. దాన్నిబట్టే చెప్పొచ్చు రాష్ట్రంలో మహిళలకు రక్షణఅనేది లేదని'' అని ఉమ తెలిపారు. 

read more   మహిళా దినోత్సవం రోజున ఆందోళన... రాజధాని మహిళలపై పెట్టిన సెక్షన్లివే...

''క్రైమ్ నెం-63, 64 అండర్ సెక్షన్ 143, 188, 332, 353, 506, 509, రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద మహిళలపై కేసులు పెడతారా? ఇదేం దారుణం? రాజధాని మహిళలు చేసిన తప్పేమిటి? ఈ ప్రభుత్వానికి, పోలీసులకు బుద్ధి, జ్ఞానంఅనేది ఉందా? శాంతియుత మార్గంలో అమ్మవారి దర్శనానికి వెళ్లే మహిళలను, అమ్మవారి కోసం వారు తీసుకెళుతున్న ప్రసాదాలను బూటుకాళ్లతో తన్నిందే కాక, వారిపై ఇటువంటి సెక్షన్లు పెడతారా? అవమానకరంగా మహిళలపై ప్రవర్తించే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? రాష్ట్రంలో మహిళపై దాడులు జరుగుతూ, వారిహక్కులు కాలరాయబడుతుంటే మహిళా కమిషన్ భజన చేస్తోందా? ప్రభుత్వానికి, జగన్ కు ఊడిగంచేస్తోందా. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్  కూడా మహిళే కదా? ఆడవాళ్లను బూటుకాళ్లతో తన్నిన పోలీసులుకు ఆడవాళ్లు లేరా...వారికి తల్లులు, చెల్లెళ్లు, భార్యలు లేరా? ఉంటే వారిపై కూడా అలానే ప్రవర్తిస్తారా?'' అని మండిపడ్డారు. 

''మహిళలను మహిళా పోలీసులతోనే అడ్డుకోవాలనే నిబంధనను కాదని, దుర్మార్గంగాప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. డీఎస్పీ, సీఐ, ఎసై, కానిస్టేబుల్ సహ ప్రతి ఒక్కరినీ దారుణంగా శిక్షించాలి. మహిళలను తాకరానిచోట్ల తాకి, వారిని బూటుకాళ్లతో తన్ని, వారి భోజనాన్ని, అమ్మవారికి సమర్పించే ప్రసాదాలను నేలపాలు చేసిన పోలీసులను జగన్ ప్రభుత్వం తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మహిళలపై దౌర్జన్యాలు చేయడానికే ఉన్నారా? వారి ప్రతాపమంతా ఆడవారిపైనేనా? ఇటువంటి పనులుచేయడానికి వారికి సిగ్గుందా? ఏం నేరం చేశారని అమరావతి మహిళలపై పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారు? వారు ఏమైనా నక్సలైట్లా, లేక సంఘవిద్రోహశక్తులా..లేక ఉగ్రవాదులా? రాజధాని మహిళలపై అమానుషంగా, కర్కశంగా ప్రవర్తించిన ప్రతి పోలీస్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. ప్రభుత్వం,  పోలీసులు ఇటువంటి దాష్టీకాలకు పాల్పడటం, ముమ్మాటికీ సిగ్గుచేటు'' అని అన్నారు.

 ''ప్రభావతి, మల్లీశ్వరి, గోవిందమ్మ, ప్రియాంక, శిరీష, రాధిక, రాయపాటి శైలజ ఎవరు వీరంతా? తీవ్రవాదులని వారిపై ఎఫ్ఐఆర్ లు నమోదుచేశారా? మహిళలపై వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఉన్నకపట ప్రేమ ఈ ఘటనతోనే అర్థమవుతోంది. మహిళల జోలికివచ్చినవారు ఏవిధంగా మట్టికొట్టుకుపోయారో, పురాణకాలం నుంచీ చూస్తూనే ఉన్నాం. అటువంటి పరిస్థితే అమరావతిలో జరగనుంది. ఏపీలో మహిళలపై దుశ్శాసనపర్వానికి పాల్పడిన ప్రభు త్వం మట్టికొట్టుకుపోవడం ఖాయం'' అని బోండా ఉమ హెచ్చరించారు. 

''తమను ఎవరైనా వేధిస్తే, తమకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఆడవారు పోలీసులకు చెప్పుకుంటారని, అటువంటిది పోలీసులే ఆడవాళ్లను బూటుకాళ్లతో తన్ని, చీరలు పట్టుకొని లాగి, తాకరాని ప్రదేశాల్లో తాకుతూ, ఇష్టానుసారం ప్రవర్తిస్తారా? డీఎస్పీ అయితే ఒక మహిళ రొమ్ములపై చేయివేసి నీచాతినీచంగా అచ్చోసిన ఆంబోతులా ప్రవర్తించాడు. పోలీసులు తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ ఉచ్ఛం నీచం లేకుండా ప్రవర్తిస్తు న్నారు. అదే పోలీస్ అధికారి భార్యరొమ్ములపై ఎవరైనా చేయేస్తే అతను ఊరుకుంటాడా? ఆ డీఎస్పీ, సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల ఇళ్లలోని ఆడవాళ్లపై చేతులేసి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే వారు  ఊరుకుంటారా? ప్రభుత్వ, పోలీసుల చర్యలను తెలుగుజాతి యావత్తూ ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నా'' అని మండిపడ్డారు. 

బ్రిటీష్ కాలంలో ఆనాటిపోలీసులు భారతీయమహిళలపై ప్రవర్తించిన దానికన్నా దారుణంగా, ఏపీ పోలీసులు అమరావతి రైతులపై అమానుషంగా ప్రవర్తించారు. జగన్ ప్రభుత్వం సాగించిన దుశ్శాసన పర్వాన్ని ఖండించాల్సిన బాధ్యత విజయవాడ-గుంటూరువాసులపై లేదా? ఆయాప్రాంతాలవారు రాజధాని ఉద్యమానికి, అమరావతి రైతులు, మహిళలకు సంఘీభావం ప్రకటించాల్సిన బాద్యతలేదా? పోలీసులు తన్నింది అమరావతి మహిళలనే... మాఇంట్లో వాళ్లను కాదుకదా అనుకొని ఊరుకునే ప్రతిఒక్కరి ఇళ్లల్లోని ఆడవాళ్లకు కూడా భవిష్యత్ లో ఇదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నాను.  రేపు ఇదే పోలీసులు మీ ఇళ్లలోని ఆడవాళ్లను కూడా బూటుకాళ్లతో తన్ని, వారి బట్టలుకూడా చించే పరిస్థితి వస్తుందని ప్రతిఒక్కరూ ఆలోచించండి'' అని హెచ్చరించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios