టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల హత్యకు కొందరు ప్రణాళిక రచించారని వ్యాఖ్యానించారు. జూన్ 22లోపు చంపేస్తామని తనకు డెడ్‌లైన్ పెట్టారని ఉమ వెల్లడించారు.

తనతో పాటు మరికొందరికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆయన తెలిపారు. తమను చంపడానికి కొన్ని బృందాలు ఏర్పడ్డాయని బొండా ఉమా చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరోవైపు కరోనా కారణంగా సోమవారం ఆన్‌లైన్‌లో టీడీఎల్పీ సమావేశం జరిగింది. టీడీపీ నేతల అరెస్ట్‌లను నిరసిస్తూ రేపు నల్లచొక్కాలతో అసెంబ్లీకి హాజరుకావాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అయితే అసెంబ్లీకి వెళ్లొద్దని పలువురు నేతలు సూచించారు.

ఒకవేళ సభకు వెళ్లని పక్షంలో మండలిలో కొన్ని బిల్లులను ఆమోదించుకునే ప్రమాదం వుందని మరికొందరు టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్ధితిని బట్టి అవసరమైతే వాకౌట్ చేసి బయటకు రావాలని ఇంకొందరు నేతలు సూచించారు.