కర్నూలు: తెలుగుదేశం పార్టీ (టీడీపీ), కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ఆయన ప్రయత్నించారు.  రాజకీయంగా తనను అందరూ మోసం చేశారని ఆయన మనస్తాపానికి గురయ్యాడు. 

తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బంగి అనంతయ్య ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ఉరేసుకుంటుండడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయన ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. 

కుటుంబ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారి పోవడంతో... టిడిపి అధినేత ఇచ్చిన హామీని నిలబెట్టుకో కాకపోవడంతో....తీవ్ర మనస్థాపానికి గురైన బంగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య యత్నం ప్రయత్నం చేయడంతో సకాలంలో గుర్తించిన కుటుంబ సభ్యులు అతడిని కాపాడి ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. 

ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న బంగి తన అధినేత ఇచ్చిన హామీ నిలబెట్టుకో కాకపోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఉన్న స్థలాలు, పొలాలు అన్నీ పోగొట్టుకున్నామని కుటుంబ సభ్యులను సైతం ఆరోపిస్తున్నారు. అహర్నిశలు పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యత ఏమీ లేదని పెదవి విరిచారు. 

బంగి అనంతయ్య తన వినూత్నమైన కార్యక్రమాల ద్వారా తెలుగువారందరికీ తెలిసిన నాయకుడు. ప్రత్యేక రీతుల్లో ఆయన ప్రజా సమస్యలపై ప్రతిస్పందిస్తూ ఉంటారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ప్రత్యేక హోదా ఉద్యమాల్లో పాల్గొన్నారు.