ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఓ టీడీపీ నేత ఇరుకునపడ్డారు.  జగన్ పై అభ్యంతరకర కామెంట్స్ చేసినందుకు కార్వేటినగరం మాజీ ఎంపీపీ, టీడీపీ నేత జనార్దన్‌ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. 

గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలానికి చెందిన జనార్దన్ రాజును శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 26న తలకోనలో సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న విషయంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. 

దీంతో శుక్రవారం రాత్రి జనార్దన్‌రాజును కార్వేటినగరం సీఐ సురేందర్‌రెడ్డి అరెస్ట్ చేశారు. అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆందోళన చేపట్టారు. కాగా... ఇప్పటికే చాలా మంది జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా బుక్కయ్యారు.