Asianet News TeluguAsianet News Telugu

ఎంతో నమ్మకంతో గెలిపిస్తే... సేవ చేయకుండా నీలిచిత్రాలు చూపిస్తారా? ఎంపీ గోరంట్ల మాధవ్ పై బాలకృష్ణ ఫైర్

గోరంట్ల మాధవ్ ను నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నీలి చిత్రాలు చూపిస్తున్నారంటూ హిందూపుర్ ఎమ్మెల్యే,నటుడు బాలకృష్ణ ఫైర్ అయ్యారు. 

TDP Hindupur mla, actor nandamuri balakrishna fire on Gorantla Madhav and YS Jagan
Author
Hyderabad, First Published Aug 18, 2022, 8:01 AM IST

హిందూపురం : వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సభ్యసమాజం తలదించుకునే పని చేశారని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సత్యసాయి జిల్లా లేపాక్షిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ మాధవ్ తీరుపై మండిపడ్డారు. ప్రజలు ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపిస్తే ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రజలకు సేవ చేయకుండా.. నీలి చిత్రాలు  చూపించారు అని విమర్శించారు.

ఎంపీ ఏ ముఖం పెట్టుకుని హిందూపురంలో జాతీయ జెండా ఎగురవేసేందుకు వచ్చారని ప్రశ్నించారు. ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో సీఎం జగన్ ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్క ఛాన్స్ అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. చేతకాని పాలనతో ప్రజలను కష్టాల పాలు చేశారని విమర్శించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, వైసీపీ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేసిందన్నారు. కనీసం ఎరువులు,  విత్తనాలను రాయితీపై ఇవ్వడం లేదని అన్నారు. ఈ కార్యక్రమానికి  టిడిపి నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. 

ఏపీలో చల్లారని గోరంట్ల వీడియో వ్యవహారం... మీరు రంగంలోకి దిగండి : సీబీఐకి హైకోర్టు లాయర్ ఫిర్యాదు

కాగా, గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ కాదని తెలిసినా ఈ గొడవ చల్లారడం లేదు. దీనిమీద వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కూడా విరుచుకుపడుతూనే ఉన్నారు. ఆగస్ట్ 13న మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని అనుసరించాలని చెప్పినందుకు తనను దేశద్రోహిగా చిత్రీకరించి.. చిత్రహింసలు పెట్టి.. ఊరికి రాకుండా ఎప్పటికప్పుడు కేసులు పెడుతున్న తమ పార్టీ ప్రభుత్వం.. నగ్న వీడియో వివాదంలో చిక్కుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ కు 500కార్లతో  భారీ స్వాగతం పలకడం ఏమిటని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. 

ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... దేశం తమవైపు చూస్తోందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరుచూ చెబుతుంటారని, ఈ రకమైన ప్రోత్సాహంతో నిజంగానే దేశమంతా తమ వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలపై ఇప్పటికే చెత్త పన్ను, మరుగుదొడ్డి పన్ను, ఆస్తిపన్ను పేరిట భారాన్ని మోపిన జగన్మోహన్ రెడ్డి తాజాగా ఇంపాక్ట్ పన్ను భారంతో ఎన్నికలకు వెడితే జనం తమను ఉతికి ఆరేస్తారని పేర్కొన్నారు. విజయమ్మ కారు ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కోరారు. ఒకే సమయంలో రెండు టైర్లు బద్దలవ్వడం వెనక ఏదైనా కుట్ర ఉందేమో తేల్చాలని రఘురామ డిమాండ్ చేశారు.

కాగా, రాష్ట్ర ప్రజలు, అక్క చెల్లెలు, తల్లులు సెల్ ఫోన్లు చూడొద్దని మొట్టమొదటిసారి విజ్ఞప్తి చేయాల్సి వచ్చిందని సినీ నటుడు పృథ్వీరాజ్ పేర్కొన్నారు. ‘వాంటెడ్ పండుగాడు’ చిత్ర యూనిట్ విశాఖలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఎంపీ గోరంట్ల మాధవ్ దిగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో గురించి విలేకరులు అడిగిన ప్రశ్నకు పృథ్వీరాజ్ స్పందించారు వరలక్ష్మీ వ్రతం ముందు రోజే వచ్చిన ఆ దరిద్రాన్ని తాను చూశానని అందుకే మిగిలిన వారిని చూడొద్దని చెప్పానని అన్నారు.

దేశ చరిత్రలో ఇంత దౌర్భాగ్యం ఎప్పుడూ లేదన్నారు.  పార్లమెంటు అంటే పవిత్ర దేవాలయమని భారతదేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన సమరయోధులు ఎందరో అందులో కొలువై ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి వాళ్ళు ఉండాల్సిన చోట ఇలాంటి వారు ఉన్నారని విమర్శించారు. ‘ గతంలో వారం రోజుల పాటు  నా మీద ప్రెస్ మీట్ పెట్టారు.. ఇప్పుడేవి?’  అని ప్రశ్నించారు.  ప్రస్తుతం ఒక ప్రెస్ మీట్  లేదన్నారు. ‘అనంతపురం  ఎస్.పి  విలేకరుల సమావేశం పెడుతున్నట్లు ఆయనకు ఎలా తెలుసు? ఎస్పీ మాట్లాడుతున్నప్పుడే.. మాధవ్ ఢిల్లీలో మాట్లాడారు. ఇంగ్లాండ్ నుంచి అప్లోడ్ అయింది. ఎవరో చేశారు. ఒరిజినల్ క్లిప్ ను కనిపెట్టలేకపోయాం… అంటూ ఎస్పీ మాటలు చాలా దీనంగా ఉన్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు అరగంటలో వాస్తవం తేలుస్తారు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అంటూనే ఫేక్ అని తేల్చేశారు. వాళ్ల కోర్టులో అది ఫేక్ దేనని  తేలుతుంది’ అని పృథ్వీరాజ్ వివరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios