Asianet News TeluguAsianet News Telugu

కుప్పంలో యువగళం: పాదయాత్రను ప్రారంభించిన నారా లోకేష్

కుప్పం నుండి  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్  ఇవాళ  కుప్పంలో  పాదయాత్రను ప్రారంభించారు.   4 వేల కిలోమీటర్ల దూరం లోకేష్ పాదయాత్ర నిర్వహించనున్నారు. 

TDP General Secretary starts Padayatra in Kuppam
Author
First Published Jan 27, 2023, 11:25 AM IST

కుప్పం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  శుక్రవారం నాడు  పాదయాత్రను  ప్రారంభించారు. యువ గళం పేరుతో లోకేష్ పాదయాత్రను తలపెట్టారు.  400 రోజుల పాటు  4 వేల కిలోమీటర్ల పాటు   లోకేష్ పాదయాత్ర  నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా  సుమారు  100  అసెంబ్లీ నియోజకవర్గాల గుండా  ఈ యాత్ర సాగేలా  టీడీపీ  నేతలు రూట్ మ్యాప్  ను సిద్దం  చేశారు. 

కుప్పం  పట్టణంలోని  వరదరాజుల స్వామి ఆలయంలో   ఇవాళ ఉదయం  లోకేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఆలయంలో  పూజలు  చేసిన తర్వాత  లోకేష్   పాదయాత్రను ప్రారంభించారు.  ఇవాళ ఉదయం  11:03 గంటలకు   కుప్పం నుండి లోకేష్ పాదయాత్రను ప్రారభించారు. నిర్ణీత ముహుర్తం  మేరకు  లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ తో పాటు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు , ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, , హిందూపురం ఎమ్మెల్యే, సినీ  నటుడు బాలకృష్ణ తదితరులు  ఆలయంలో పూజలు చేశారు.  ఈ పాదయాత్రలో పలువరు మాజీ మంత్రులు  పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. 

హెబ్రాన్  హౌస్ ఆఫ్ వర్షిప్ చర్చిలో  లోకేష్ ప్రార్ధనలు చేశారు. అనంతరం   అంబేద్కర్ విగ్రహనికి, ఎన్టీఆర్,  పొట్టి శ్రీరాములు , గాంధీ  విగ్రహలకు  లోకేష్ నివాళులర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు   బహిరంగ సభ నిర్వహిస్తారుఈ సభలో  లోకేష్ ప్రంసగించనున్నారు.  తొలి రోజున  8.3 కి.మీ పాటు  లోకేష్ పాదయాత్ర నిర్వహించనున్నారు. 

also read:ఈ నెల 27 నుండి లోకేష్ పాదయాత్ర: తిరుపతిలో ప్రత్యేక పూజలు చేయనున్న టీడీపీ నేత

ఉమ్మడి రాష్ట్రంలో సైకిల్ యాత్ర  లేదా పాదయాత్ర చేయాలని భావించారు.  అయితే  2014 ఎన్నికలకు ముందు  చంద్రబాబునాయుడు  పాదయాత్ర  నిర్వహించడంతో పార్టీ పనులు లోకేష్ పై పడ్డాయి.  చంద్రబాబునాయుడు పాదయాత్ర  ముగిసిన తర్వాత  ఎన్నికలకు  సమాయాత్తం  కావాల్సిన  పరిస్థితులు నెలకొన్నాయి.  దీంతో  లోకేష్ సైకిల్ యాత్ర  నిర్వహించలేదు.  2014లో  ఏపీలో టీడీపీ  ప్రభుత్వం  ఏర్పాటు   చేసింది.     ఈ కారణంగా యాత్ర నిర్వహించాల్సిన అవసరం లేకుండా  పోయింది.  2019లో  ఏపీలో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. ఎన్నికలకు  మరో ఏడాది సమయం ఉంది.

 ఈ తరుణంలో  లోకేష్ యాత్రను ప్రారంభించారు. ఈ నెల  25వ తేదీన  హైద్రాబాద్ లో  ఎన్టీఆర్ ఘాట్ లో  లోకేష్ నివాళులర్పించారు.  అనంతరం కడపలో అమీన్ పీర్ దర్గాను  సందర్శించారు.  అక్కడి నుండి   తిరుపతికి చేరుకున్నారు. నిన్న తిరుపతిలో  లోకేష్ పూజలు నిర్వహించారు.  నిన్న సాయంత్రానికి  కుప్పం పట్టణానికి చేరుకున్నారు.  కుప్పం ఆర్ అండ్  బి అతిథి గృహంలో  ఆయన బస చేశారు. ఈ నెల  25వ తేదీన  హైద్రాబాద్ లో  ఎన్టీఆర్ ఘాట్ లో  లోకేష్ నివాళులర్పించారు.  అనంతరం కడపలో అమీన్ పీర్ దర్గాను  సందర్శించారు.  అక్కడి నుండి   తిరుపతికి చేరుకున్నారు. నిన్న తిరుపతిలో  లోకేష్ పూజలు నిర్వహించారు.  నిన్న సాయంత్రానికి  కుప్పం పట్టణానికి చేరుకున్నారు.  కుప్పం ఆర్ అండ్  బి అతిథి గృహంలో  ఆయన బస చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios