విజయవాడ: కృష్ణా జిల్లా టిడిపిలో విషాదం చోటుచేసుకుంది. బెజవాడలో ఇవాళ(సోమవారం) ఇద్దరు తాజా మాజీ టీడీపీ కార్పొరేటర్ల హటాత్తుగా మరణించారు. కరోనా మహమ్మారి బారిన పడి చికిత్ప పొందుతూ కృష్ణలంక మాజీ కార్పొరేటర్ గోపర్తి నరసింహారావు మృతి ఇవాళ తుదిశ్వాస విడిచారు. అంతేకాకుండా మధురానగర్ మాజీ కార్పొరేటర్ ఆత్కూరు రవికుమార్ హార్ట్ ఎటాక్ తో మృతిచెందారు. 

కృష్ణలంక మాజీ కార్పొరేటర్ గోపర్తి నరసింహారావు కొద్దిరోజుల క్రితం కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు నగరంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందాడు. అయితే ఇవాళ అతడి పరిస్థితి విషమించి మరణించారు. 

మధురానగర్ మాజీ కార్పోరేటర్ రవికుమార్ కూడా ఇవాళ ఉదయం హటాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. ఇలా ఒకే రోజు ఇద్దరు మాజీ కార్పోరేటర్లు మరణించడంతో టిడిపిలో విషాదం నెలకొంది.