Asianet News TeluguAsianet News Telugu

చిత్తూరు ఎన్నికల పంచాయితీ హైకోర్టుకు: ఎన్నికలు వాయిదాకు టీడీపీ పట్టు

చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫోర్జరీ సంతకాలతో తమ నామినేషన్లను ఉపసంహరించారని టీడీపీ అభ్యర్ధులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పూర్తి వివరాలు రేపు  ఇస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. దీంతో విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

TDP demands to postpone chittoor municipal elections lns
Author
Amaravathi, First Published Mar 7, 2021, 11:23 AM IST

చిత్తూరు: చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఫోర్జరీ సంతకాలతో తమ నామినేషన్లను ఉపసంహరించారని టీడీపీ అభ్యర్ధులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై పూర్తి వివరాలు రేపు  ఇస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. దీంతో విచారణను సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

చిత్తూరు మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేసిన టీడీపీ అభ్యర్ధులు తమ నామినేషన్లను ఉపసంహరించుకొన్నారు. తమకు తెలియకుండానే ఫోర్జరీ సంతకాలతో ప్రత్యర్ధులు నామినేషన్లను విత్ డ్రా చేయించారని టీడీపీ అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయమై టీడీపీ నాయకత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై ఆదివారం నాడు హైకోర్టు విచారణకు స్వీకరించింది.

ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్ధుల నామినేషన్లను ఉపసంహరింపజేసిన విషయమై హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయమై పూర్తి వివరాలను సోమవారం నాడు అందిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 

దీంతో విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా 10వ తేదీన ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

చిత్తూరు మున్సిపాలిటీలో ని 18 వార్డులకు ఎన్నికలను నిలిపివేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. సోమవారం నాడు హైకోర్టుకు ఏ రకమైన నివేదికను అందిస్తోందోనేది ఆసక్తికరంగా మారింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios