చంద్రబాబు కోసం వినాయకుడికి నారా భువనేశ్వరి పూజలు

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న సంగతి తెలిసిందే.  వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం రాజమండ్రిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయానికి భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. 

tdp chief chandrababu naidu wife nara bhuvaneswari special prayers in temple in rajahmundry ksp

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో వున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యంగా వుండాలంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి పర్వదినం సందర్భంగా సోమవారం రాజమండ్రిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయానికి భువనేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపారు. భువనేశ్వరి వెంట ఆమె సోదరుడు బాలకృష్ణ సతీమణి వసుంధర కూడా వున్నారు. 

అంతకుముందు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుతో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి‌లతో పాటు టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సమావేశమయ్యారు. 45 నిమిషాల పాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు. చంద్రబాబుతో ములాఖత్ తర్వాత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడనున్నట్టుగా టీడీపీ వర్గాలు తెలిపాయి.

ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఏ తప్పూ చేయలేదని చెప్పారు. నిజమైన తప్పులు చేసినవారే చంద్రబాబును కేసులో ఇరికించారని ఆరోపించారు. కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబుపై కేసు పెట్టారని ఆరోపించారు. తప్పుడు కేసులతో చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని అన్నారు. చంద్రబాబు చేసిన కార్యక్రమాల వల్లే రాష్ట్ర అభివృద్ది జరిగిందని చెప్పారు. టీడీపీ చేసిన  అభివద్దిని వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేస్తుందని మండిపడ్డారు. వైసీపీ హయాంలో ప్రజలు కష్టాలను ఎదుర్కొంటున్నారని అన్నారు. 

Also Read: చంద్రబాబు గదిలో ఏసీ లేదు.. పార్టీ కార్యకర్తల గురించి అడిగారు: ములాఖత్ అనంతరం యనమల

చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్తు గురించే ఆలోచిస్తారని యనమల తెలిపారు. చంద్రబాబు పార్టీ కార్యకర్తల గురించి అడిగారని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్‌ను పలువురు జాతీయ నాయకులు ఖండించారని..  సంఘీభావం తెలిపిన నేతలకు కృతజ్ఞతలు  చెప్పమన్నారని తెలిపారు. జైలులో చంద్రబాబుకు సరైన సౌకర్యాలు లేవని అన్నారు. చంద్రబాబు గదిలో ఏసీ లేదని అన్నారు.

ఏసీ  గురించి అడిగితే.. నిబంధనల ప్రకారం ఏసీ ఇవ్వడం కుదరదని అధికారులు చెప్పినట్టుగా తెలిపారు. చంద్రబాబు  గదిలో దోమలు ఉన్నాయని.. మూడు రోజుల తర్వాత  దోమ ఇచ్చారని చెప్పారు. శాసనసభకు సమావేశాలకు హాజరవుతామని  చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ తరఫున  ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించినట్టుగా చెప్పారు. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అంశాలపై నిర్ణయం  తీసుకుంటామని తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios