Asianet News TeluguAsianet News Telugu

కుప్పం మున్సిపల్ ఎన్నిక: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, దారికాచి మరి .. వైసీపీపై బాబు ఆగ్రహం

స్థానిక సంస్థల ఎన్నికల (ap local body elections) సందర్భంగా కుప్పం, నెల్లూరు, గురజాలలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు టీడీపీ (tdp) చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . తాము ఎన్నో ప్రికాషన్స్ తీసుకున్నామని.. అయినప్పటికీ దారి కాచి అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇన్ని ప్రికాషన్స్ నా రాజకీయ జీవితంలో ఎన్నడూ తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు

tdp chief chandrababu naidu slams ysrcp over kuppam municipal election
Author
Amaravati, First Published Nov 9, 2021, 6:09 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల (ap local body elections) సందర్భంగా కుప్పం, నెల్లూరు, గురజాలలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు టీడీపీ (tdp) చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీపై (ysrcp) ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారని బాబు దుయ్యబట్టారు. వైసీపీ అరాచకాలకు హద్దు లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. కొందరు పోలీసులు, అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. నామినేషన్ కేంద్రంలో అభ్యర్ధులను భయభ్రాంతులను చేశారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తాము ఎన్నో ప్రికాషన్స్ తీసుకున్నామని.. అయినప్పటికీ దారి కాచి అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఇన్ని ప్రికాషన్స్ నా రాజకీయ జీవితంలో ఎన్నడూ తీసుకోలేదని చంద్రబాబు స్పష్టం చేశారు. వీలైనంత వరకు అందరికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు. ఏడు సార్లుగా తాను కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించానని చంద్రబాబు గుర్తుచేశారు. కుప్పం 14వ వార్డులో బెస్త కులానికి చెందిన వెంకటేశ్ నామినేషన్ వేశారని ఆయన తెలిపారు. అయితే వెంకటేశ్‌ను బుల్లెట్ మీద వచ్చి గుద్దేసి వెళ్లిపోయారని చంద్రబాబు ఆరోపించారు. 

ALso Read:ఫోర్జరీ సంతకాలతో నామినేషన్ల ఉపసంహరణ: నీలం సహానీకి బాబు ఫోన్

కుప్పం వివాదాస్పద నియోజకవర్గం కాదని.. ఇక్కడ గతంలో గొడవలు జరిగిన సందర్భం లేదని టీడీపీ చీఫ్ గుర్తుచేశారు. అలాంటి కుప్పంలో దళితులు, బీసీ వర్గాలను ఎన్నికల్లో అడ్డుకున్నారని చంద్రబాబు మంవడిపడ్డారు. వెంకటేష్ నామినేషన్‌ను కావాలనే తిరస్కరించారని.. అభ్యర్థుల సంతకాలు లేకుండా విత్ డ్రా అయినట్లు ఎలా ప్రకటిస్తారని ప్రతిపక్షనేత ప్రశ్నించారు. నామినేషన్‌లు విత్ డ్రా తరువాత కుప్పంలో ఫైనల్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదని చంద్రబాబు నిలదీశారు. 

కుప్పం, నెల్లూరులో ఎన్నికల అధికారుల తీరు దారుణమని.. ఫోర్జరీ సంతకాలతో నామినేషన్‌లలో అక్రమాలు చేసిన అధికారులకు సిగ్గుందా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి (amarnath reddy) చొక్కా చింపి ఈడ్చుకు వెళ్లారని... తప్పు చేసింది కాక మళ్ళీ టీడీపీ నేతలపై కేసులు పెడతారా అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. తనకు దండ వేశాడని పుంగనూరులో రమణా రెడ్డి అనే వ్యక్తి ప్రహరీ గోడను కూల్చి వేశారని... వారిపై పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios