వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంలో చిత్తు చిత్తుగా ఓడిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫలితాల అనంతరం మొదటిసారి బయటకు వచ్చారు.

టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.. అనంతరం కార్యకర్తలతో ఆయన సమావేశమవుతారు.