కార్యకర్తల రక్షణ కోసం టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని నేతలకు సూచించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అమరావతిలో జరిగిన టీడీఎల్పీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాయకత్వ లక్షణాలు బయటపడతాయన్నారు.

గత 15 రోజులుగా టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని.. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులు ప్రాధాన్య క్రమంలో పూర్తి చేశామని చంద్రబాబు తెలిపారు. నిర్మాణం చివరి దశకు వచ్చిన సమయంలో ఇప్పుడు వాటిని రద్దు చేస్తున్నారని విమర్శించారు.

అవగాహన లేకుండా పోవడం.. చెప్పుడు మాటలు వినడం, టీడీపీపై బురద జల్లడమే వైసీపీ త్రిసూత్రంగా పెట్టుకుందని బాబు ఎద్దేవా చేశారు.