Asianet News TeluguAsianet News Telugu

నన్ను షూట్ చేయండి: పోలీసులపై చంద్రబాబు మండిపాటు

విశాఖపట్నంలో తను నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భగ్గుమన్నారు. పోలీసుల తీరుపై మండిపడిన ఆయన కావాలంటూ తనను షూట్ చేయండి అంటూ వ్యాఖ్యానించారు. 

tdp chief chandrababu naidu fires on police over blocking in Visakhapatnam airport
Author
Visakhapatnam, First Published Feb 27, 2020, 3:46 PM IST

విశాఖపట్నంలో తను నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భగ్గుమన్నారు. పోలీసుల తీరుపై మండిపడిన ఆయన కావాలంటూ తనను షూట్ చేయండి అంటూ వ్యాఖ్యానించారు.

Also read:4 గంటలుగా కారులోనే: ఎయిర్‌పోర్టులోనే బాబు బైఠాయింపు

వైసీపీ కార్యకర్తల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో తాను రెండు రోజుల పాటు యాత్ర నిర్వహిస్తానని ముందే పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

స్థానిక టీడీపీ నేతలతో పాటు విజయనగరంలో కూడా పోలీసుల నుంచి పర్మిషన్ తీసుకున్నారని బాబు స్పష్టం చేశారు. తాను విశాఖకు వచ్చిన తర్వాత వైసీపీ నేతలు డబ్బులిచ్చి మనుషులను తీసుకొచ్చి పెద్ద ఎత్తున తనపైనా, టీడీపీ కార్యకర్తలపైనా కోడిగుడ్లు, చెప్పులు, వాటర్ బాటిళ్లు చివరికి రాళ్లు కూడా వేయించారని చంద్రబాబు మండిపడ్డారు.

ఒక గంటలో పంపిస్తామని చెప్పి గంటల తరబడి తనను వెయిట్ చేయించి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సిందిగా చెబుతున్నారని దుయ్యబట్టారు. అయితే తనను ఏ చట్టం కింద వెళ్లమంటున్నారని ఆయన ప్రశ్నించారు.

తనకు ఆ విషయం చెబితే ఎక్కడకు రమ్మంటే అక్కడికి వస్తానని.. ఎప్పుడు వదిలితే అప్పుడు బయటకు వెళ్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. 14 సంవత్సరాలు సీఎంగా, 11 సంవత్సరాలు ప్రతిపక్షనేతగా ఉన్న తన పట్ల ఇలా ప్రవర్తించడం తగదని ఆయన పోలీసులపై ఫైరయ్యారు. 

విశాఖలో భూకబ్జాలు పెరిగాయని, చివరికి చెరువును కూడా కబ్జా చేశారని అవన్నీ చూస్తానంటే మీకెందుకు భయమని చంద్రబాబు ప్రశ్నించారు. 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 11 మంది ముఖ్యమంత్రులను చూశానని కానీ ఇలాంటి పరిస్ధితి తనకు ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. జగన్ పరిపాలనపై ప్రజల్లో అంతర్మథనం మొదలైందని.. పోలీసులు కూడా తమ విధి నిర్వహించాలి కానీ తప్పులు చేయరాదని చంద్రబాబు సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios