భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. తన సొంత ప్రచారం కోసం సీఎం జగన్ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు.

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ బుధవారం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తోంది. ఆల్రెడీ శంకుస్థాపన జరిగిపోయిన భోగాపురానికి మళ్లీ భూమిపూజ ఏంటంటూ మండిపడుతున్నారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. తన సొంత ప్రచారం కోసం సీఎం జగన్ భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేశారని ఆరోపించారు. ఐదేళ్ల కిందట టీడీపీ హయాంలోనే భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం జరిగిందన్నారు. ఫుల్ యాడ్స్ కోసం ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. హిందూజాలకు, అమూల్‌కు ప్రభుత్వ ధనాన్ని ధారాదత్తం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు అండగా నిలవడంలో జగన్ విఫలమయ్యారని టీడీపీ అధినేత మండిపడ్డారు. కష్టాల్లో వున్న అన్నదాతలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. వర్షాలపై ముందస్తు హెచ్చరికలు లేకపోడంతో పంట నష్టం ఎక్కవగా జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు కనీసం రైతులను పరామర్శించడం లేదని .. వరి, మొక్కజోన్న రైతులకు ఎకరాకు రూ.30 వేలు.. మిర్చి, అరటి, మామిడి రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అలాగే పిడుగుపాటు గురై మరణించిన బాధితుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందంచాలని ఆయన కోరారు. తడిసిన ధాన్యాన్ని మద్ధతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.