Asianet News TeluguAsianet News Telugu

నాతో కష్టాలు చెప్పుకున్నారని.. వరద బాధితులను బెదిరిస్తారా , వైసీపీ నేతలది క్రూరత్వం : చంద్రబాబు

వరద సహాయక చర్యలకు సంబంధించి వైఎస్ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. నాతో కష్టాలు చెప్పుకున్నారని వరద బాధితులను బెదిరిస్తారా అంటూ ఆయన ఫైరయ్యారు. 

tdp chief chandrababu naidu fires on ap cm ys jagan over flood rehabilitation
Author
Amaravati, First Published Aug 1, 2022, 2:25 PM IST

గోదావరి వరదలు (Godavari floods) , సహాయక చర్యలకు సంబంధించి వైసీపీ ప్రభుత్వంపై (ysrcp govt) మండిపడ్డారు టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . ఈ మేరకు సోమవారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘ గోదావరి వరదలతో సర్వం కోల్పోయిన బాధితులకు మానవతా హృదయంతో సాయం చేయాల్సింది పోయి, వాళ్ళ కష్టాలను నాతో చెప్పుకున్నందుకు బెదిరిస్తారా? వేలేరుపాడులో నేను పర్యటించినప్పుడు వరద సాయం అందలేదని మాతో చెప్పుకున్న బాధిత మహిళలను పునరావాసం కేంద్రం నుంచి వెళ్లగొట్టడం, పైగా బెదిరించడం దారుణం’’ అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరో ట్వీట్‌లో .. ‘‘ వైసీపీ నేతల క్రూరత్వం తెలిసిందే. రెవెన్యూ ఉద్యోగులు కూడా వారికి వంత పాడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మనమేమన్నా ఆటవికయుగంలో ఉన్నామా? ప్రతిపక్ష నేతలకు కష్టాలు చెప్పుకున్నందుకు ప్రతీకారచర్యలా? ప్రజలను ఆదుకోకుండా తప్పుచేసింది మీరు కాదా? వైసీపీ నేతల ఈ శాడిజాన్ని నేను ఖండిస్తున్నాను’’ అని ఆయన అన్నారు. 

Also REad:పోలవరం కోసం ఇళ్లు, భూములు ఇచ్చారు.. వాళ్ల త్యాగానికి న్యాయం చేయరా : సీఎస్‌కు చంద్రబాబు లేఖ

మరోవైపు..చంద్రబాబు నాయుడు ఈ నెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ మీటింగ్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర మహోత్సవాల సందర్భంగా 2023 వరకు ఆజాదీ కా అమృత్ ఉత్సవాలకు భారత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల నేషనల్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అధినేతలను కేంద్రం ఆహ్వానించింది. ఈ మేరకు కేంద్రం నుంచి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు.. ఈ నెల 6వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్‌లో నిర్వహించే సమావేశానికి హాజరవుతారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios