Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో ఏం జరుగుతోంది.. చంద్రబాబు వ్యూహామేంటీ..?

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు వంటి ప్రచారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే దాని ప్రభావం ఏపీ పైనా పడే అవకాశం ఉండటంతో.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు. 

TDP Chief chandrababu naidu emergency meeting for telangana early elections
Author
Amaravathi, First Published Sep 5, 2018, 11:22 AM IST

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, అసెంబ్లీ రద్దు వంటి ప్రచారం నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం హీటెక్కింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తే దాని ప్రభావం ఏపీ పైనా పడే అవకాశం ఉండటంతో.. టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలర్ట్ అయ్యారు.

అమరావతిలో టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలు, ఎమ్మెల్యేలతో  తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. తెలంగాణలో టీడీపీ అనుసరించాల్సిన వ్యూహాం.. అసెంబ్లీ ఒకవేళ రద్దు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటిస్తే.. ఎలాంటి వ్యూహాం అమలు చేయాలి..? తెలంగాణలో తాను కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని సీఎం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

టీడీపీకీ నేతలు లేకపోయినా.. పటిష్టమైన క్యాడర్ ఉందని నమ్ముతున్న చంద్రబాబు వారిని ఏ విధంగా ముందుకు నడిపించాలన్న దానిపై సమాలోచనలు జరిపే వీలుంది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలా అన్న దానిపై చర్చించనున్నారు. అంతేకాకుండా తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తుండాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణను ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios