కుప్పంలో టెన్షన్ టెన్షన్: రోడ్డుపై బైఠాయించి చంద్రబాబు నిరసన

కుప్పంలో వైసీపీ శ్రేణుల దాడులకు నిరసనగా రోడ్డుపై బైఠాయించి చంద్రబాబునాయుడు గురువారం నాడు నిరసనకు దిగారు. 

TDP Chief Chandrababu Naidu Conducts Protest in Kuppam

 కుప్పం:  వైసీపీ శ్రేణుల దాడులను నిరసిస్తూ టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కుప్పంలో రోడ్డుపై బైఠాయించి గడురువారం నాడు  నిరసనకు దిగారు..  ఇవాళ రెండో రోజున కుప్పంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.చంద్రబాబు షెడ్యూల్ లోఇవాళ  కుప్పంలో అన్న క్యాంటీన్ ను  ప్రారంభించాల్సి ఉంది. చంద్రబాబు ప్రారంభించాల్సిన అన్న క్యాంటీన్ ను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి.. టీడీపీ కార్యాలయంపై కూడా వైసీపీ శ్రేణులు దాడకి దిగాయి. ఈ సమయంలో చంద్రబాబునాయుడు గెస్ట్ హౌస్ లో ఉన్నారు. ఈ  ఘటనలను టీడీపీ నేతలు చంద్రబాబుకు వివరించారు.  గెస్ట్ హౌస్ నుండి కాలినడకన .అన్న క్యాంటిన్ వద్దకు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. 

 నిన్న రామకుప్పం మండలం కొల్లుపల్లిలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఘర్ణణ చోటు చేసుకుంది.  ఇరు వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. తాము ఏర్పాటు చేసిన పార్టీ జెండాల వద్దే వైసీపీ కూడా జెండాలు కట్టడంతో వివాదం చోటు చేసుకొంది. వైసీపీ జెండాలను టీడీపీ వర్గీయులు తొలగించారు. దీనికి వైసీపీ వర్గీయులు అభ్యంతరం చెప్పారు. ఈ విషయమై ఇరు వర్గాలు రోడ్డుపై నిరసనకు దిగారు. ఆ తర్వాత ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పోలీసులు సహా రెండు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. మరో వైపుే  వైసీపీ నేత ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి దిగాయి. కారును ధ్వంసం చేశాయి. దీంతో చంద్రబాబు టూర్ ను ఇవాళ అడ్డుకుంటామని వైసీపీ ప్రకటించింది. దీంతో ఇవాళ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ పార్టీ నేత ఇంటిపై దాడిని నిరసిస్తూ అన్న క్యాంటిన్ పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి దిగారు. ఈ దాడులను నిరిస్తూ చంద్రబాబు నాయుడు  కుప్పం రోడ్డుపై బైఠాయించి  నిరసనకు దిగారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios