సారాంశం

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టి యువగళం పాదయాత్ర ముగింపు సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు హాజరుకానున్నారు. 

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టి యువగళం పాదయాత్ర ముగింపు సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు హాజరుకానున్నారు. ఈ మేరకు విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. లోకేష్ పాదయాత్ర డిసెంబర్ 6న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకుంటుందని, అక్కడి నుంచి మొదలై డిసెంబర్ 17తో యాత్ర ముగుస్తుందని ఆయన తెలిపారు. 

ఈ నెల 27న చిత్తూరు జిల్లా కుప్పంలో లోకేష్ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. 4 వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు యాత్ర సాగించాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఈ మధ్యలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అయితే చంద్రబాబుకు బెయిల్ రావడం, తిరిగి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడంతో లోకేష్ కూడా ఇటీవల యువగళాన్ని పున: ప్రారంభించారు. 

ALso Read: Nara Chandrababu Naidu..దుష్టులను శిక్షించాలని కోరుకున్నా: కనకదుర్గమ్మను దర్శించుకున్న బాబు

ఇకపోతే.. శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుష్టులను శిక్షించాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా చెప్పారు. తాను కష్టకాలంలో ఉన్న సమయంలో అందరూ తన కోసం ప్రార్ధించారని.. న్యాయం , ధర్మం కోసం పోరాటం చేశారని కొనియాడారు. ను  కష్టంలో ఉన్నప్పుడు తన కోసం ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లంతా పోరాటం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. విశాఖపట్టణంలోని సింహాచలం అప్పన్నను, శ్రీశైలం మల్లికార్జునస్వామిని కూడ  చంద్రబాబు దంపతులు దర్శించుకోనున్నారు.