రాజధాని రైతులకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. అసెంబ్లీ నుంచి వెళుతూ శుక్రవారం మందడం దీక్షా శిబిరం వద్ద ఆగిన ఆయన రైతులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల పోరాటానికి మద్దతు తెలిపారు. ఎప్పటికైనా న్యాయమే విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కొంత మంది పోలీసులు కావాలనే రైతులు, మహిళలను ఇబ్బంది పెడుతున్నారన్నారని.. వారిపై న్యాయపరంగా పోరాడతామని చంద్రబాబు వెల్లడించారు.

అమరావతి రైతులు ఏకాకులు కాదని, వారి పోరాటం వృథా కాదని పేర్కొన్నారు. అమరావతిని ఇక్కడి నుంచి తరలించడం ఎవరితరం కాదని చంద్రబాబు హెచ్చరించారు. మూడు రాజధానులు అనేది జగన్‌ తుగ్లక్‌ నిర్ణయమని ప్రతిపక్షనేత మండిపడ్డారు