పల్నాడులో దారుణ పరిస్ధితులు ఉన్నాయన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఎంత దూరమైన వెళ్తానని.. పల్నాడు పరిస్థితులను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

వైసీపీ కార్యకర్తలను జగన్ అదుపులో పెట్టుకోవాలని బాబు హెచ్చరించారు. డీజీపీ అమెరికాలో ఉన్నారా..? సమస్య తెలియదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఎస్పీ, ఐజీ ఏమి చేస్తున్నారు.. వాళ్లకి తెలియదని అని నిలదీశారు.

ముందు నన్ను కొట్టాలని ఆయన సవాల్ విసిరారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కంటే దారుణంగా జగన్ ప్రవర్తిస్తున్నారని.. ఇప్పటి వరకు ఏడుగురు టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని, అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.