Asianet News TeluguAsianet News Telugu

Chandrababu: "వారి సినిమా దగ్గరపడింది.. ఇక 100 రోజులే మిగిలాయి.. "

Chandrababu: అధికార వైఎస్సార్సీపీ సినిమా దగ్గరపడిందనీ, ఆ పార్టీకి ఇంకో వంద రోజులే మిగిలిందని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఎద్దేవా చేశారు. కుప్పం నియోజకవర్గం పరిధిలోని గుడుపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

TDP chief Chandrababu is set to visit his constituency Kuppam for three days KRJ
Author
First Published Dec 29, 2023, 1:40 AM IST

Chandrababu: ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల ప్రకటన రాకముందే.. అధికార, ప్రతిపక్షాల మధ్య వాడివేడీ మాటల యుద్దం జరుగుతోంది. మరోవైపు..కొందరూ నేతలు పార్టీని వీడి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే.. మరికొందరూ పార్టీలోనే ఉంటూ తమ సరైన గుర్తింపు లేదంటూ ఆవేదవ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటన నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో గురువారం సాయంత్రం గుడిపల్లెలో రోడ్ షోలో నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగిస్తూ.. తాను ఎప్పుడు వచ్చినా గుడిపల్లె ప్రజలు ఎంతగానో ఆదరిస్తారని, కుప్పం తన సొంత గడ్డ వంటిదని చెప్పుకొచ్చారు. కుప్పం ప్రజలు గత 35 ఏళ్లుగా తనని వారి కుటుంబ సభ్యుడిగా భావించి.. తనపై ప్రేమాభిమానాలు కనబరుస్తారని అన్నారు. ప్రజల ఆదరణ చూస్తుంటే.. ఈ ఎన్నికల్లో తనకు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. 

తాను కుప్పంలో పర్యటించడానికి  తానేదో ముఖ్యమంత్రిని కావడానికి కాదనీ, మళ్లీ కుప్పం ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదని అన్నారు. అరాచకాలకు, అహంకారానికి, నియంతృత్వానికి చరమగీతం పాడాలనే లక్ష్యంతో,  ప్రజా క్షేత్రంలోకి దిగాననీ,  తన లాంటి వాడికే రక్షణ లేకపోతే.. రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ఇటీవల కుప్పంలో రౌడీయిజం పెరిగిపోయిందనీ, ఇక్కడి ప్రజలను తన ద్రుష్టికి తీసుకవచ్చారని చెప్పారు. 

ఈ తరుణంలో అధికార వైఎస్సార్సీపీ టార్గెట్ చేశారు. వైఎస్సార్సీపీ సినిమా అయిపోయిందనీ,  మరో 100 రోజులే వారికి మిగిలున్నాయనీ, ఇప్పటికే వారు 100 తప్పులు చేశారని అన్నారు. వైసీపీని మిడిసిపడొద్దనీ, అధికార నేతలు చేసిన అవినీతిని పూర్తి  స్తాయిలో కక్కిస్తాననీ ,  అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తానని విమర్శించారు.   

పోలీసులకు కూడా తానే దిక్క అనీ,  తాను ప్రవ్తవించిన  వ్యాఖ్యలను గుర్తుపెట్టుకోవాలనీ,  ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలు కూడా ముందుకు రావాలని అన్నారు. ఎన్నికల సంఘం కూడా రాష్ట్రంలో ఇప్పటికే క్రియాశీలకం అయిందనీ,  ఇకపై జరిగే కార్యక్రమాలన్నీ ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరుగుతాయనీ, పోలీసులు ఎన్నికల సంఘం కింద పనిచేస్తున్నారనీ,  సైకో జగన్ కింద పని చేసే రోజులు పోతాయని వివరించారు. 

ఈ క్రమంలో టీడీపీ మేనిఫెస్టో  అంశాలను కూడా చంద్రబాబు వెల్లడించారు. ఆడబిడ్డలకు నెలకు రూ.1500 ఇస్తామని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. తన పార్టీ అధికారంలోకి వచ్చాక .. ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది అని స్పష్టం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios