టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న దాడులపై మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని జనార్థన్ రెడ్డి కాలనీలో అక్రమ నిర్మాణాలంటూ టీడీపీ కార్యకర్తల ఇళ్లు కూల్చడం దారుణమంటూ ఆయన ట్వీట్ చేశారు.

ఇకనైనా ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ఆపాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదన్న కారణంతో టీడీపీ మద్ధతుదారులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటం తగదని ఆయన హితవు పలికారు. ఈ మేరకు టీడీపీ నాయకుల ఇళ్ల కూల్చివేతకు రంగం సిద్ధమన్న పేపర్ కటింగ్‌ను ఆయన షేర్ చేశారు.