గుంటూరు: తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ2 సాయంతో జగన్ లక్షకోట్ల అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయాడని టిడిపి అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ ప్రతి కార్యక్రమాన్ని అవినీతి కోసం డిజైన్ చేస్తున్నారని అన్నారు. 

''మద్యపాన నిషేధం పేరుతో వీళ్లే షాపులు ఓపెన్ చేశారు. జగన్ కు ఇష్టమైన బ్రాండ్లే ప్రమోట్ చేశారు. రేట్లు విపరీతంగా పెంచారు. జే ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఇలా మద్యంతో పేదప్రజల రక్తం తాగే ప్రభుత్వం ఇది. పిచ్చి బ్రాండ్లతో, రేట్లు  పెంచడం వల్ల పేదలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా చితికిపోతున్నారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

'' ఉచిత ఇసుక విధానాన్ని ఎందుకు అమలుచేయలేకపోయారు. ఇసుకలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. మైన్స్ లో అవినీతికి పాల్పడటం జగన్ కు బాగా అలవాటు. ఇందుకు అడ్వైజర్ ను పెట్టుకున్నారు. గెలాక్సీ గ్రానైట్ ను మేం కాపాడితే.. జగన్ ఇష్టానుసారంగా కొట్టేస్తున్నారు'' అని అన్నారు. 

read more  వదిలేది లేదు...చంద్రబాబు, లోకేశ్ లకు టెస్టులు: మంత్రి అనిల్ కుమార్ వెల్లడి

''వైసిపి ప్రభుత్వం అందరినీ బ్లాక్ మెయిల్ చేస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి వందల కోట్ల ట్యాక్స్ లు వేస్తున్నారు. చాలా మైన్స్ ను వైసీపీ నేతలే హ్యాండోవర్ చేసుకున్నారు. పెద్దఎత్తున భూకుంభకోణాలకు పాల్పడుతున్నారు. అసైన్డ్ భూములు కొట్టేస్తున్నారు. విశాఖలో పెద్దఎత్తున భూములు ఆక్రమిస్తున్నారు'' అని ఆరోపించారు. 

''మడ భూములు కొట్టేశారు. పేదలకు ఇంటి స్థలాల పేరుతో పక్కదారి పట్టిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల కాంట్రాక్టులను క్యాన్సిల్ చేసి నచ్చిన వారికి అప్పజెబుతున్నారు. పీపీఏలు రద్దు చేసి బ్లాక్ మెయిల్ చేశారు. డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారు. కేంద్రమే ఎనర్జీని టేకప్ చేయడానికి జగన్మోహన రెడ్డే కారణం'' అని అన్నారు. 

''బిల్డ్ ఏపీ పేరుతో సోల్డ్ ఏపీ చేస్తున్నారు. కరోనా సమయంలో ఎవరైనా వేలం వేస్తారా. నచ్చిన వారికి విక్రయించేందుకే చేస్తున్నారు. టీటీడీ భూములు అమ్ముతున్నారు. అన్ని దేవాలయాల్లో అవినీతి జరుగుతోంది. కనకదుర్గ గుడిలో అవినీతి, సింహాచలం భూములు కొట్టేస్తున్నారు. సలహాదారులు రాష్ట్రాన్ని దోపిడీ చేసే పనిలో ఉన్నారు'' అని అన్నారు. 

read more  గ్రామ సభలో పాల్గొనడానికి నేను సిద్దం... దాన్నికూడా నిరూపిస్తా: అచ్చెన్నాయుడు సవాల్

''4 లక్షల మంది వాలంటీర్లు దేనికోసం. వైసీపీ కార్యకర్తలకు ఉద్యోగాలు ఇచ్చారు. రాష్ట్రాన్ని దోపిడీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు.  కార్యక్రమాలకు మంచి పేర్లు పెట్టి మొత్తం నాశనం చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. స్కామ్ లు చేయడంలో, ఎదురుదాడి చేయడంలో వైసీపీ నేతలు దిట్టలు. ప్రజాధనం దోపిడీ చేస్తుంటే ఊరుకోం. పెద్దఎత్తున పోరాటం చేస్తాం'' అని చంద్రబాబు హెచ్చరించారు.