ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైసీపీ- టీడీపీల మధ్య చోటు చేసుచేసుకున్న వివాదం ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారైంది. అటు చంద్రబాబుకు పోటీగా వైసీపీ కూడా అమిత్ షాను కలిసే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం వైసీపీ- టీడీపీల మధ్య చోటు చేసుచేసుకున్న వివాదం ఢిల్లీకి చేరింది. దేశ రాజధానిలో బల ప్రదర్శనకు సిద్ధమయ్యాయి అధికార, ప్రతిపక్ష పార్టీలు. 36 గంటల దీక్ష ముగియగానే టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను (amit shah) కలిసి టీడీపీ కార్యాలయాలపై వైసీపీ దాడులపై ఫిర్యాదు చేయనున్నారు. అటు చంద్రబాబుకు పోటీగా వైసీపీ కూడా అమిత్ షాను కలిసే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ఎంపీలు కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయనకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఖరారైంది. 

36 గంటల పాటు ఆయన దీక్ష ముగింపు సందర్భంగా శుక్రవారం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇది ప్రజా దేవాలయమని ఆయన చెప్పారు. డీజీపీ ఆఫీసులకు వంద గజాల దూరంలోనే దాడి జరిగిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. డీజీపీ (ap dgp) అనుకుని వుంటే ఇది జరిగేదా అని ఆయన ప్రశ్నించారు. ఇది ఉగ్రవాదం కాక మరేమిటని చంద్రబాబు నిలదీశారు. ప్రభుత్వ అరాచకాలు పరాకాష్టకు చేరాయని.. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ధికంగా, శారీరకంగా, మానసికంగా మమ్మల్ని వేధించారని చంద్రబాబు ఆరోపించారు. 

Also Read:కొట్టుకుందాం అంటే.. కొట్టేసుకుందాం, డేట్ .. టైం ఫిక్స్ చేయండి: జగన్‌కు కేశినేని సవాల్

పిల్లల భవిష్యత్ నాశనం అయ్యేలా డ్రగ్స్ (drugs) వినియోగం జరుగుతోందని.. డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్‌గా మారిందని ఆయన ఆరోపించారు. పోలీసులు, అధికార యంత్రాంగానికి భయపడి తాము సరెండర్ కావాలా అని చంద్రబాబు ప్రశ్నించారు. డ్రగ్స్‌పై టీడీపీ పోరాటం చేస్తుందని.. దశలవారీగా మద్యనిషేధం విధిస్తామని ప్రభుత్వం చెప్పిందా, లేదా అని ఆయన నిలదీశారు. తెలంగాణ సీఎం (kcr) రివ్యూ చేసి డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేస్తామన్నారని.. ఏపీ సీఎం డ్రగ్స్‌పై (ys jagan) సమీక్ష ఎందుకు చేయడం లేదని చంద్రబాబు నిలదీశారు. టీడీపీ నేతలపై దాడులు జరిగితే పోలీసులు సాక్ష్యాలు అడుగుతున్నారని ఆయన మండిపడ్డారు. పోలీసులు మీ చొక్కాలు తీసేసి మాకిస్తే మేమే ఇన్వెస్టిగేషన్ చేస్తామంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో తాను ఎప్పుడైనా బూతులు మాట్లాడానా అని ఆయన ప్రశ్నించారు. ఏపీలో లెక్కడా లేని మద్యం బ్రాండ్లు వున్నాయని.. తాను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు జగన్ చిన్న పిల్లాడని చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీ సీఎంకు డ్రగ్స్‌పై సమీక్ష చేసే తీరిక లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. తప్పుల్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ భవన్‌పై దాడికి సమీక్ష చేస్తారా అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. దాడి చేసినవారిపై కేసులు లేవని.. పట్టాభి (pattabhi) తిట్టారని కేసులు పెట్టారంటూ ఆయన మండిపడ్డారు. పట్టాభి ఏదో తిట్టారంట.. ఆ తిట్టు ఏంటో కూడా తనకు తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పట్టాభి ఏదో మాట్లాడారని వైసీపీ వాళ్లు రీసెర్చ్ చేశారని.. తాను గట్టిగా మాట్లాడతాను కానీ, బూతులు తిట్టనని ఆయన స్పష్టం చేశారు. పట్టాభి మాటలకు కొత్త అర్థాలు చెప్పారని.. ఏపీలో లక్ష కోట్ల డ్రగ్స్ వున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నా ఈ గుడ్డి సీఎంకు మాత్రం కనిపించదంటూ చంద్రబాబు దుయ్యబట్టారు.