తెనాలి మున్సిపల్ మీటింగ్ లో గందరగోళం: బాహాబాహీకి దిగిన టీడీపీ, వైసీపీ

తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో  ఇవాళ గందరగోళం నెలకొంది.  వైసీపీ, టీడీపీ  కౌన్సిలర్లు  బాహాబాహీకి దిగారు.  దీంతో  ఈ సమావేశాన్ని  అర్ధాంతరంగా వాయిదా  వేశారు  మున్సిపల్ చైర్ పర్సన్.

Tdp and  YCP  councillors  attack each other  in Tenali  Municipal council meeting lns

 తెనాలి: ఉమ్మడి గుంటూరు జిల్లాలోని  తెనాలి మున్సిపల్ కౌన్సిల్  సమావేశంలో  శుక్రవారంనాడు   గందరగోళం నెలకొంది. టీడీపీ, వైసీపీ  కౌన్సిలర్లు  బాహా బాహీకి దిగారు. టెండర్ల కేటాయింపు విషయమై  ఇరువర్గాల మధ్య  ప్రారంభమైన వాగ్వాదం  టీడీపీ, వైసీపీ  వర్గీయుల  మధ్య ఘర్షణకు దారి తీసింది.  టెండర్లను  అధికార పార్టీకి  చెందినవారికి కట్టబడెడుతున్నారని  టీడీపీ కౌన్సిలర్లు  ఆరోపించారు. ఈ విషయమై  వైసీపీ కౌన్సిలర్లు  అభ్యంతరం వ్యక్తం  చేశారు. ఈ విషయమై  ఇరు వర్గాల మధ్య  మాటల యుద్ధం  చోటు  చేసుకుంది. ఈ వాగ్వాదం  ఇరువర్గాల మధ్య తోపులాటకు  చోటు  చేసుకుంది.  ఇరువర్గాలు  పరస్పరం దాడి  చేసుకున్నారు.  దీంతో  సభను చైర్ పర్సన్ వాయిదా వేశారు.  అయితే   ఈ ఘటనను నిరసిస్తూ  మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలోనే టీడీపీ సభ్యులు  బైఠాయించి  నిరసనకు దిగారు.  అయితే  సభ సజావుగా  జరిగేలా  చూసేందుకు  చైర్ పర్సన్ ప్రయత్నిస్తున్నారు.  కౌన్సిలర్లను  పిలిచి చైర్ పర్సన్ మాట్లాడుతున్నారు. ఇదిలా ఉంటే  ఈ ఘర్షణ  నేపథ్యంలో పోలీసులు కూడ తెనాలి మున్సిపల్ కార్యాలయానికి  చేరుకున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios