కేశినేని నానికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తల నిరసనలు.. (వీడియో)

 పశ్చిమ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా కేశినేని నాని వద్దంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. పార్టీ కోసం పని‌చేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కేశినేని నానికి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు ఎవరూ సహకరించరు. నాని నియామకాన్ని రద్దు చేయాలని చంద్రబాబును కోరుతున్నాం అన్నారు. 

TDP activists oppose kesineni nani as Western constituency in charge in vijayawada

విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం ఇన్ ఛార్జిగా kesineni nani వద్దంటూ టిడిపి కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాలకే బాధ్యత అప్పగించాలని పశ్చిమ నియోజకవర్గం టిడిపి నేతలు విజ్ఞప్తి చేశారు. 

"

నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం Buddha Venkanna, Nagul Meera కృషి చేశారని, ఎంపి కేశినేని నాని నియంతృత్వ పోకడల వల్లే కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ నష్టపోయిందని వారు చెబుతున్నారు.

చంద్రబాబు నివాసం పై దాడి చేసినా, మంత్రులు బూతులు తిట్టినా ఎంపి స్పందించ లేదని, వైసిపి నాయకుల విమర్శలపై ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇంటి వద్ద జోగి రమేష్ ను అడ్డుకున్న నాయకుడు బుద్దా వెంకన్న అని, కార్యకర్తలకు, నాయకులుగా అండగా ఉండే నేతలు వెంకన్న, నాగుల్ మీరా అని చెప్పుకొచ్చారు.

పార్టీ కోసం పని‌చేసే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.  కేశినేని నానికి నియోజకవర్గంలో టిడిపి కార్యకర్తలు ఎవరూ సహకరించరు. నాని నియామకాన్ని రద్దు చేయాలని చంద్రబాబును కోరుతున్నాం అన్నారు. 

కాగా, విజయవాడ పశ్చిమ ఇన్‌చార్జి పదవిని చివరి వరకు పార్టీ సీనియర్ నేతలు బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరా (nagul meera) ఆశించినప్పటికీ.. కేశినేని వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. బుద్ధా వెంకన్న, నాగుల్‌ మీరాకు ఇప్పటికే పార్టీలో వేర్వేరు బాధ్యతలు ఉన్నందున పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవిని కేశినేని నానికి అప్పగించారు చంద్రబాబు. ఈ నియోజకవర్గంలో డివిజన్ స్థాయి కమిటీలను నియమించుకునేందుకు కేశినేని నానికి చంద్రబాబు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. 

ఇప్పటికే బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వేసిన కమిటీలను పక్కన పెట్టాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. కాగా, విజయవాడ పశ్చిమలో టీడీపీ బలోపేతమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. కేశినేని నాని రావడంతో పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అయితే, బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాకు.. ఎంపీ కేశినేని నానికి మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ వ్యవహారం రచ్చకెక్కి పార్టీ ఘోర పరాజయానికి కారణమైంది. ఈ క్రమంలో ఎంపీ కేశినేనికి కీలక పదవి అప్పగించడం.. టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని స్థానిక కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios