Asianet News TeluguAsianet News Telugu

భారీ ఎర్రచందనం డంప్ కనుగొన్న టాస్క్ ఫోర్స్.. 348 ఎర్రచందనం దుంగలు స్వాధీనం...

వడమాలపేట, పుత్తూరు మార్గ మధ్యలో కల సదాశివ కోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దుంగలు కలిగిన డంప్ ను ఆర్ ఎస్ ఏ ఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. రెండు రోజులు పాటు కూంబింగ్ చేపట్టి 348 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 

Task force finds huge red sandalwood dump in Chittoor - bsb
Author
Hyderabad, First Published Jul 1, 2021, 4:27 PM IST

వడమాలపేట, పుత్తూరు మార్గ మధ్యలో కల సదాశివ కోన అటవీ ప్రాంతంలో 348 ఎర్రచందనం దుంగలు కలిగిన డంప్ ను ఆర్ ఎస్ ఏ ఎస్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కనుగొన్నారు. రెండు రోజులు పాటు కూంబింగ్ చేపట్టి 348 దుంగలు స్వాధీనం చేసుకున్నారు. 

అనంతపురం రేంజ్ డిఐజి క్రాంతి రాణా టాటా  ఆదేశాల మేరకు డీఎస్పీ మురళీధర్ కు అందిన సమాచారంతో ఆర్ ఐ భాస్కర్, సిఐ వెంకట్ రవిల నేతృత్వంలోని ఆర్ ఎస్ఐలు సురేష్, విశ్వనాథ్ ల టీమ్ లు రెండు రోజుల పాటు సదాశివ కోన అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. 

బుధవారం సాయంత్రానికి భారీ డంప్ ను కనుగొన్నట్లు డీఎస్పీ మురళీధర్ తెలిపారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడుతూ ఇంత పెద్ద డంప్ ఇటీవలి కాలంలో లభించ లేదని అన్నారు. లాక్ డౌన్ లో ఎర్రచందనం దుంగలు సేకరించి పెట్టుకుని, లాక్ డౌన్ ముగియగానే తమిళనాడు లాంటి రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధం చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు. 

డంప్ చేసిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. డంప్ స్వాధీనం చేసుకున్న సిబ్బందిని డిఐజి అభినందించినట్లు తెలిపారు. సిఐ సుబ్రహ్మణ్యం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఆర్ ఐ భాస్కర్, సిఐ లు వెంకట్ రవి, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం, ఎఫ్ ఆర్ ఓ ప్రసాద్, ఆర్ ఎస్ ఐ సురేష్, లింగాధర్ పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios