ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర టీడీపీ నేతలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఇతర టీడీపీ నేతలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనుమానితుల చిత్రాలను ఫిర్యాదుతో పాటు అందజేశారు. నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ.. చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశామని చెప్పారు.
చంద్రబాబు సభా ప్రాంగణంలో వైసీపీ నేతలను ఏం పని అని ప్రశ్నించారు. రాళ్లదాడికి స్థానిక ఎమ్మెల్యే, ఎమెల్సీ అనుచరులేనని ఆరోపించారు. వైసీపీ వాళ్ల దగ్గర కవర్‌లో రాళ్లు కూడా ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అందజేశామని చెప్పారు.
ఇక, టీడీపీ నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగ్గయ్యపేటకు వెళ్తున్న చంద్రబాబు నాయుడుకు నందిగామలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు వారికి అభివాదం చేస్తున్నారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు చంద్రబాబు వాహనంపై రాళ్లతో దాడి చేశాడు. వాహనంపై రాళ్ల దాడి జరిగిన ఘటనలో చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు. అయితే చంద్రాబు ప్రధాన భద్రతా అధికారి మధుబాబుకు రాయి తగలడంతో గాయమైంది. దీంతో వెంటనే మధుబాబుకు ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటన తర్వాత ఎస్పీజీ భద్రతా సిబ్బంది చంద్రబాబు నాయుడుకు భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులు రోప్ పార్టీ భద్రతను ఏర్పాటు చేశారు.
అయితే ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. సీఎం వైఎస్ జగన్ నేర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై నేరపూరిత చర్యలను జగన్ ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. గత మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రతి సంస్థను జగన్ నాశనం చేశారని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు.
ఇక, ఈ ఘటనపై విచారణకు పోలీసు కమిషనర్ కాంతిరాణా ప్రత్యే క బృందాన్ని ఏర్పాటు చేశారు. విజయవాడ తూర్పు డీసీపీ విశాల్ గున్నీ నేతృత్వంలోని ఈ దర్యాప్తు బృందం విచారణ చేపట్టనుంది.
