కుప్పం: ఏపీ రాష్ట్రంలో మద్యం దుకాణాలను ఇవాళ తెరవడంతో పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రం నుండి మందు బాబులు కుప్పం పట్టణానికి తరలివచ్చారు.  మందు కోసం క్యూ లైన్లలో నిలబడ్డారు. మందు కోసం దుకాణం వద్ద ఒక్కసారిగా ఎగబడడంతో దుకాణాన్ని మూసివేసి వెళ్లిపోయాడు యజమాని.

తమిళనాడు రాష్ట్రానికి సరిహద్దులోనే కుప్పం నియోజకవర్గం ఉంటుంది. దీంతో కుప్పం వాసులు తమిళనాడు రాష్ట్రానికి రాకపోకలు సాగిస్తుంటారు. ఏపీలో ఇవాళ మద్యం దుకాణాలు తెరిచారు. దీంతో తమిళనాడు రాష్ట్రానికి చెందిన సరిహద్దు గ్రామాల ప్రజలు కుప్పం పట్టణంలో మందు కొనుగోలు కోసం వచ్చారు.

also read:కరోనా ఎఫెక్ట్: 108, 104 వాహనాల్లో వెంటిలేటర్లు, అత్యాధునిక వైద్య సదుపాయాలు

లాక్ డౌన్ నిబంధనలను బేఖాతరు చేస్తూ మందుబాబులు కుప్పం చేరుకొన్నారు. ఒకేసారి మద్యం కొనుగోలు కోసం ఎగబడ్డారు. సోషల్ డిస్టెన్స్ పాటించలేదు.గుంపులు గుంపులుగా మందుబాబులు క్యూ లో నిల్చొన్నారు. కిలోమీటరు దూరం పాటు క్యూ లైన్లో నిల్చున్నారు. ఒకేసారి మద్యం కొనుగోలు కోసం రావడంతో మద్యం దుకాణాన్ని మూసివేశాడు యజమాని. 

ఏపీ రాష్ట్రంలోని పలు చోట్ల ఇవాళ మద్యం దుకాణాల వద్ద భారీగా మందు బాబులు నిల్చున్నారు. ఉదయం  నుండే మద్యం దుకాణాలు ఎప్పుడు తెరుస్తారా అని ఎదురు చూశారు. కొన్నిచోట్ల మద్యం దుకాణాలు తెరవాలంటూ మందు బాబులు ఆందోళనలు కూడ నిర్వహించారు.