అనంతపురం: జిల్లాలోని తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏం చేసినా కూడా సంచలనమే. తహసీల్దార్ కుర్చీలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూర్చొన్నాడు. ఈ ఘటన ప్రస్తుతం చర్చకు దారితీసింది.గత ఏడాది తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన అనుచరులపై పెద్దారెడ్డి దాడికి దిగాడు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చొనే కుర్చీలో పెద్దారెడ్డి కూర్చున్నాడు.

ఈ విషయాన్ని గుర్తించిన జేసీ అనుచరులు ఆ కుర్చీని దగ్ధం చేశారు.  బుధవారం నాడు యల్లనూరు తహసీల్దార్ కుర్చీలో కూర్చొని హల్ చల్ చేశాడు. ఇది ప్రభుత్వ కార్యాలయమేనా అంటూ ఆయన అధికారులను ప్రశ్నించారు. 

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ఏళ్లుగా గొడవలు ఉన్నాయి. గత ఎన్నికల్లో జేసీ కుటుంబం ఓటమి పాలైంది. ఈ ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డిపై  కేతిరెడ్డి పెద్దారెడ్డి విజయం సాధించాడు..తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ మధ్య  కొంత కాలంగా మాటల యుద్దం సాగుతున్న విషయం తెలిసిందే.