డొక్కానియామకం: ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి భేటీ

ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆదివారం నాడు భేటీ అయ్యారు. వైసీపీ తాడికొండ  అదనపు సమన్వయకర్తగా నియమించడంపై చర్చించినట్టుగా సమాచారం., కొన్ని రోజులుగా తాడికొండలో డొక్కా మాణిక్య వరప్రసాద్ , శ్రీదేవి వర్గీయుల మధ్య ఆధిపత్య పోరు సాగుతుంది. 

Tadikonda MLA Sridevi Meets MLC Appi Reddy  in Guntur

గుంటూరు: ఎమ్మెల్సీ అప్పిరెడ్డితో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆదివారం నాడు భేటీ అయ్యారు. తాడికొండ వైసీపీ అదనపు సమన్వయకర్తగా డొక్కా మాణిక్యవరప్రసాద్ ను నియమించడంతో  వైసీపీలో ఆధిపత్యం కోసం రెండు వర్గాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ నెల 19న డొక్కా మాణిక్యవరప్రసాద్ ను వైసీపీ తాడికొం డ అసెంబ్లీ నియోజకవర్గానికి అదనపు సమన్వయకర్తగా పార్టీ నాయకత్వం నియమించిన విషయం తెలిసిందే. 

డొక్కా మాణిక్య వరప్రసాద్ ను  అదనపు సమన్వయకర్తగా నియమించడంతో  ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు మండిపడుతున్నారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్ కు వ్యతిరేకంగా ర్యాలీలు చేశారు. ఇటీవలనే రెండు వర్గాలు బాహా బాహీకి కూడా దిగాయి. నిన్న రెండు వర్గాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

తాడికొండ రాజకీయాల్లో డొక్కా మాణిక్య వరప్రసాద్ ఎంట్రీ ఇవ్వడంతో ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీదేవి ఇవాళ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో భేటీ అయ్యారు. సుమారు రెండు గంటలకుపైగా అప్పిరెడ్డితో  ఎమ్మెల్యే శ్రీదేవి చర్చించారు.డొక్కా మాణిక్య వరప్రసాద్ ను అదనపు సమన్వయకర్తగా నియమించడంపై ఎమ్మెల్యే శ్రీదేవి చర్చించినట్టుగా ఆమె వర్గీయులు చెబుతున్నారు.

also read:తాడికొండ వైసీపీలో ముదిరిన ఆధిపత్య పోరు.. శ్రీదేవి, డొక్కా వర్గీయుల పోటాపోటీ ర్యాలీలు

తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004, 2009 నుండి  డొక్కా మాణిక్య వరప్రసాద్  కాంగ్రెస్ పార్టీ నుండి రెండు దఫాలు ప్రాతినిథ్యం వహించాడు.  2019లో  టీడీపీ అధికారాన్ని కోల్పోయిన కొన్ని రోజులకు డొక్కా మాణిక్క వరప్రసాద్ వైసీపీలో చేరారు. టీడీపీలో చేరడానికి ముందు కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీలో  ఉన్నారు.  తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాణిక్య వరప్రసాద్ ను  ఈ నియోజకవర్గంలో అదనపు  సమన్వయకర్తగా నియమించడంతో వైసీపీ లో అధిపత్య పోరు ప్రారంభమైంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ ను ఈ నియోజకవర్గంలో అదనపు సమన్వయకర్తగా నియమించడంతో  వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయింపులో మార్పులు చోటు చేసుకొంటాయా అనే చర్చ కూడా లేకపోలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios