గుంటూరులో వివాహిత అనుమానాస్పద మృతి..

నవ్య తరచుగా health issuesతో బాధపడుతూ ఉండేది. శనివారం రాత్రి అదే అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మృతురాలి తండ్రి రఘుకు సమాచారం అందించగా ఇంటికి వచ్చాడు. చనిపోయిన సమయంలో భర్త ఇక్కడ లేకపోవడం.. అత్తా,మామల దగ్గరే ఉండడంతో కూతురి మరణం విషయంలో తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు... తన కుమార్తెను అత్త, మామ, భర్తలే కావాలని murder చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

Suspicious death of a married woman in Guntur

గుంటూరు : అనుమానాస్పద స్థితిలో married woman మృతి చెందిన ఘటన మండలంలోని నల్లపాడు గ్రామంలో చోటుచేసుకుంది. నల్లపాడు పోలీస్ స్టేషన్ సిఐ ప్రేమయ్య తెలిపిన వివరాల ప్రకారం..  తెలంగాణ రాష్ట్రం భద్రాచలం సమీపంలోని సంఘం పల్లి గ్రామానికి చెందిన నవ్య (31)కు, నల్లపాడు గ్రామానికి చెందిన రాజశేఖర్ తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఉన్నాడు. రాజశేఖర్ పూణేలో software ఉద్యోగం చేసేవాడు.

ఈ క్రమంలో నవ్య తరచుగా health issuesతో బాధపడుతూ ఉండేది. శనివారం రాత్రి అదే అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో మృతురాలి తండ్రి రఘుకు సమాచారం అందించగా ఇంటికి వచ్చాడు. చనిపోయిన సమయంలో భర్త ఇక్కడ లేకపోవడం.. అత్తా,మామల దగ్గరే ఉండడంతో కూతురి మరణం విషయంలో తండ్రి అనుమానం వ్యక్తం చేశాడు... తన కుమార్తెను అత్త, మామ, భర్తలే కావాలని murder చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, భార్యకు ప్రభుత్వం Loanగా ఇచ్చిన డబ్బును తన సొంతం చేసుకునేందుకు ఆమె స్థానంలో వేరే మహిళలు భార్యగా చూపించి నగదు తీసుకుని పరారైన husband ఉదంతం ఆంధ్రప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది. విస్సన్నపేటకు చెందిన చల్లా నిర్మల శ్రీసాయి స్వశక్తి సంఘంలో సభ్యురాలిగా ఉంటూ ఎప్పటికప్పుడు పొదుపు, గత రుణానికి సంబంధించిన మొత్తం అన్ని సక్రమంగా చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త శ్రీను మరో మహిళతో extra marital affair పెట్టుకొని 3 నెలల క్రితం భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.

ఇదే సమయంలో నిర్మల సభ్యురాలిగా ఉన్న సంఘానికి ప్రభుత్వం రూ. 10 లక్షల నగదు రుణంగా మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని సంఘం అధ్యక్షురాలు సభ్యులందరికీ ఒక్కొక్కరికి రూ. లక్ష వరకు జమ చేశారు.  నిర్మల పుట్టింటికి వెళ్లడంతో ఆమె Bank pass bookలో ఫోటోను మార్చాడు. అంతేకాదు సంతకాన్ని ఫోర్జరీ చేసి.. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను.. తన భార్యగా స్థానిక సప్తగిరి బ్యాంకు అధికారులను నమ్మించి.. నగదు మొత్తాన్ని విత్డ్రా చేశాడు.

విషయం తెలుసుకున్న నిర్మల బ్యాంకు అధికారులను ఆశ్రయించగా.. అప్పటికే శ్రీను నగదు డ్రా చేసిన మహిళతో ఉడాయించాడు. విషయం బయటకు వస్తే తమ బ్యాంకు పరువు పోతుందని భావించిన బ్యాంకు అధికారులు కొందరు గ్రామ పెద్దల సహాయంతో నిర్మలతో రాజీ చేసుకుని ఆమె పేరుతో కొత్త ఖాతా ప్రారంభించి.. కొంత నగదు అందులో జమ చేశారు.  ఈ ఘటనపై బాధితురాలు నిర్మలను విచారించగా..  తన భర్త  తనకు మంజూరు అయిన నగదుతో.. మరో మహిళతో పరారయ్యాడని తెలిపింది. 

బ్యాంకు మేనేజర్  రఘును విచారించగా  నిర్మల ఖాతాలో నగదు దుర్వినియోగం అయినా ఆమెకు ఎటువంటి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఆమెకు తెలియకుండా ఆమె భర్త డ్రా చేసి పరారైన మాట వాస్తవమేనని వెలుగు సిబ్బంది తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios