విజయవాడ అజిత్ సింగ్ నగర్ కు చెందిన సస్పెండెడ్ హోంగార్డు స్థానిక మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడగా, అతడికి ఎస్సై కొమ్ముకాస్తున్నాడని బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు.

విజయవాడ: మహిళల రక్షణ కోసం జగన్ సర్కార్ దిశ చట్టం (disha act), దిశ యాప్ (disha app)వంటి అనేక చర్యలు తీసుకుంటుంటే... వాటిని అమలు చేయాల్సిన కొందరు పోలీసులే అమానుషంగా వ్యవహరిస్తున్నారు. మహిళలపై లైంగిక వేధిపులకు పాల్పడేవారు కొందరయితే... డిపార్ట్ మెంట్ వారే కాబట్టి వారిని కాపాడే ప్రయత్నం చేసేవారు మరికొందరు. ఇలా కొందరు పోలీసుల తీరుతో మహిళలకు రక్షణ కల్పించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు పలించడంలేదు. ఇలా సస్పెన్షన్ కు గురయిన ఓ హోంగార్డు మహిళలను వేధిస్తుండగా అతడికి ఎస్సై మద్దతుగా నిలుస్తున్నాడని విజయవాడకు చెందిన కొందరు మహిళలు ఆవేదన వ్యక్తం చేసారు. 

బాధిత మహిళలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయవాడ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెత్త ఫ్యాక్టరీ బ్లాక్ నంబర్ 46 లో హోంగార్డు అచ్యుతరావు నివాసముండేవాడు. అయితే అతడు ఇటీవల సస్పెన్షకు గురయ్యాడు.

వీడియో

ఇలా ఉద్యోగం లేకపోవడంతో అచ్యుత రావు నిత్యం ఫుల్లుగా మద్యం తాగుతూ ఆ మత్తులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. స్ధానిక మహిళలపై దాడులు చేయడం, అసహ్యంకరంగా తిడుతూ చుట్టు పక్కల వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇళ్లలో మగాళ్లు లేని సమయంలో తలుపులు కొడుతున్నాడని కొందరు మహిళలు ఆరోపించారు. 

అంతేకాదు ఇటీవల కరోనాతో భర్తను కోల్పోయి బతుకుదెరువు కోసం చిన్నపాటి దుకాణం పెట్టుకోని వృద్దురాలిపై కూడా అచ్యుతరావు అనవసరంగా దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళలు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. దీంతో ఎస్సై సమక్షంలో నెలరోజుల వ్యవధిలో ఆ కాలనీలో ఇళ్ళు ఖాళి చేసి వెళతానని లిఖితపూర్వకంగా రాసివ్వడంతో అతడిని పోలీసులు వదిలిపెట్టారు.

అయితే ఈ ఘటన తర్వాత అచ్యుత రావు మరింత రెచ్చిపోతు సదరు మహిళలతో అనుచితంగా మాట్లాడుతున్నాడని భాధిత మహిళలు తెలిపారు. మూడురోజుల క్రితం భార్యాభర్తలపై దాడిచేసి పారిపోయే క్రమంలో అచ్యుత రావును పట్టుకున్న స్థానికులు పోలీసులకు అప్పగించారు. 

ఏమయ్యిందో తేలీదు కానీ స్థానిక ఎస్సై కూడా అచ్యుతరావును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడని... భాధితులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అచ్యుతరావుపై చేసిన ఫిర్యాదు విత్ డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నాడని ఆరోపించారు. రాజీకి రాకుంటే ఆడవారిపై వ్యభిచారం, మగవారిపై గంజాయి కేసులు పెడతామని బెదిరింపులకు గురిచేస్తున్నాడని సదరు మహిళలు ఆరోపించారు. నిన్న (గురువారం) తమ సమస్యను సిఐ దృష్టికి తీసుకెళ్ళగా.... నిందితుడైన అచ్యుత రావును పిలిపించి మందలించి కేస్ ఫైల్ చేయమని ఎస్సైని ఆదేశించారని తెలిపారు. 

 దీంతో ఆగ్రహించిన ఎస్స్ చెత్త ప్యాక్టరిలో బతికే మీకు ఇంత ఇదా... మీసంగతీ చూస్తానంటు బెదిరించారని భాధితులు తెలిపారు. కాబట్టి తమపై ఎస్సై ఎప్పుడు ఎటువంటి అక్రమకేసులు బనాయిస్తారోనని క్షణం క్షణం నరకం అనుభవిస్తున్నామని భాధితులు తెలిపారు. ఈ విషయన్ని సిపి, డిజిపి దృష్టికి తీసుకెళ్ళి తమకు రక్షణ కల్పించాలని కోరతామని సదరు భాధిత మహిళలు తెలిపారు