విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడలో ఎస్సై విజయ్ కుమార్ ఆత్మహత్య కేసులో పోలీసులు బ్యుటిషియన్ సురేఖను అరెస్టు చేశారు. ఆయన ఆత్మహత్య చేసుకున్న సమయంలో విజయ్ కుమార్ ప్రేయసి సురేఖ ఫ్లాట్ లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వేరే అమ్మాయిని పెళ్లి విజయ్ కుమార్ పెళ్లి చేసుకోవడంతో సురేఖతో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి సురేఖ ఫ్లాట్ లోని బాత్రూంలోకి వెళ్లి తలుపులు వేసుకుందని, దాంతో భయానికి గురై విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారుడు. మద్యం మత్తులో ఉన్న విజయ్ కుమార్ తీవ్రమైన భయాందోళనలకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. 

విజయ్ కుమార్ సురేఖ తీవ్రమైన భయాందోళనలకు గురైందని చెబుతున్నారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. విజయ్ కుమార్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. గతంలో ఆయన రైల్వే ఎస్సైగా పనిచేశారు. 

ఆ తర్వాత ఆయన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, మండవల్లి పోలీసు స్టేషన్లలో పనిచేశారు. మరణించే సమయానికి ఆయన గుడివాడ టూటౌన్ ఎస్సైగా పనిచేస్తున్నాడు. హనుమాన్ జంక్షన్ లో పనిచేస్తుండగా విజయ్ కుమార్ కు సురేఖతో పరిచయం ఏర్పడింది. ఆమెతో అక్రమ సంబంధం ఆరోపణలపై గతంలో ఆయన సస్పెండ్ కూడా అయ్యాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం విజయ్ కుమార్ కు వివాహమైంది.