Asianet News TeluguAsianet News Telugu

భూ సేకరణ పేరుతో అక్రమాలు: ఎమ్మార్వో శ్రీధర్ కేసులో హైకోర్టు స్టేపై సుప్రీం అసంతృప్తి

మాజీ తహసీల్దార్ అన్నే శ్రీధర్‌పై దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. 

supreme court upset on ap high court stay on mro sridhar case
Author
New Delhi, First Published Sep 11, 2020, 4:52 PM IST

మాజీ తహసీల్దార్ అన్నే శ్రీధర్‌పై దాఖలైన క్రిమినల్ కేసు దర్యాప్తుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇవ్వడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. అమరావతిలో భూసేకరణ పేరుతో ఎస్సీ, ఎస్టీలకు చెందిన భూములను ఆక్రమించిన ఎమ్మార్వోపై విచారణ జరపకుండా స్టే ఇవ్వడం సరైనది కాదని సుప్రీం అభిప్రాయపడింది.

శ్రీధర్ కేసుకు సంబంధించి హైకోర్టు  ఇచ్చిన స్టేను రద్దు చేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ లావు నాగేశ్వరరావు శుక్రవారం విచారణ చేపట్టారు.

తహశీల్దార్‌పై పెద్ద ఎత్తున ఆరోపణలున్నా.. హైకోర్టు స్టే విధించడం సరైనది కాదని వ్యాఖ్యానించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.

కాగా అమరావతికి చెందిన మాజీ తహశీల్దార్ అన్నే శ్రీధర్, బ్రహ్మానంద రెడ్డిలు పేదల భూములను ఆక్రమించారని స్థానిక ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

తమకు భూమి ఇవ్వకుంటే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం రాకుండా చేస్తామని వారు పేదలను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.

ఈ నేపథ్యంలో తమపై నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నిందితుల అభ్యర్ధన మేరకు కేసు దర్యాప్తుపై ఏపీ హైకోర్టు స్టే విధించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios